IND VS PAK Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. చివరి వరకు చాలా రసవత్తరంగా కొనసాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో … టీమిండియా విజయం సాధించింది. హైదరాబాద్ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అలాగే శివం దూబే చివరి వరకు పోరాడి టీమిండియా జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో పాకిస్థాన్ జట్టు ఫైనల్స్ లో చిత్తైంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 19.4 ఓవర్లలో… కేవలం 5 వికెట్లు నష్టపోయిన టీమిండియా లక్ష్యాన్ని చేదించింది. మూడు బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేయాల్సిన సమయంలో… రింకు సింగ్ బౌండరీ కొట్టి జట్టును ఛాంపియన్ గా నిలిపాడు.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా… సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో 9వ సారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే 8 సార్లు గెలిచిన టీమిండియా… తన ఖాతాలో మరో ట్రోఫీని వేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే… 147 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా మొదట తడబడింది. 20 పరుగులకే 3 వికెట్లు.. కీలకమైన వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను తిలక్ వర్మ.. గట్టెక్కించాడు. కాసేపు సంజు రాణించినప్పటికీ… ఆ తర్వాత ఆటయ్యాడు. ఇక టీమ్ ఇండియా లక్కీ ప్లేయర్ శివం దుబే… తిలక్ వర్మ కు మంచి సహాయం అందించాడు. ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మ… 69 పరుగులు చేసి ఆదుకోగా… శివం దుబే 33 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో టీమిండియా లక్ష్యాన్ని 19.4 ఓవర్స్ లోనే సాధించింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది మన ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్. అయితే మొదట బౌలింగ్ ఎంచుకున్న సూర్య కుమార్ యాదవ్ సేన అద్భుతంగా బౌలింగ్ చేసింది. మొదట్లో పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హాన్ అలాగే జమాత్ అద్భుతంగా రాణించినప్పటికీ…. ఆ తర్వాత వాళ్లను కట్టడి చేశారు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 19.1 ఓవర్లలో… 146 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో ఫర్హాన్ 57 పరుగులు చేయగా జమాన్ ఒక్కడే 46 పరుగులు చేశాడు. అయుబ్ 14 పరుగులు చేశాడు.
ఇక మిగిలిన ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్ కు వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్ ఒక్కడు అవుట్ అయిన తర్వాత కేవలం 33 పరుగులకే పాకిస్తాన్ 9 వికెట్లు నష్టపోయింది. టీమ్ ఇండియా బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన అతడు ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. దీంతో పాకిస్థాన్ ప్యాకప్ అయింది. ఈ దెబ్బకు టీమిండియా సాధించింది.
THE WINNING MOMENT IN ASIA CUP FINAL. 🥶🇮🇳
– it's 8-0 against Pakistan, Winning everywhere. pic.twitter.com/WPyr8vFrQC
— Johns. (@CricCrazyJohns) September 28, 2025
Tilak Varma treating Haris Rauf to a masterclass 🔥
Watch the Asia Cup Final LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/Zu6310ttZ5
— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2025