Suryakumar Yadav Catch: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుండగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 146 పరుగులకే కుప్పకూలగా.. ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా కూడా.,. ఎదురీదుతోంది. వరుసగా వికెట్లు పడడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్… అవుట్ అయిన విధానమే వివాదంగా మారింది. సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ ను పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా… అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడు బంతి నేలపై పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఛేజింగ్ చేస్తున్న టీమిండియా…. తడబడుతోంది. తక్కువ స్కోరు చేదించాల్సిన నేపథ్యంలో టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. 20 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అభిషేక్ శర్మ, మరో ఓపెనర్ గిల్ అలాగే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముగ్గురు కూడా త్వర త్వరగా నే వికెట్ సమర్పించుకున్నారు. అయితే ఇందులో సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయిన విధానమే వివాదంగా మారింది. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షాహిన్ ఆఫ్రిది వేసిన మూడవ ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్.. టెంప్ట్ అయ్యాడు.
అయితే ఈ నేపథ్యంలోనే… సల్మాన్ అఘాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అయితే సూర్య క్యాచ్ ను ముందుకు డైవ్ చేస్తూ మరి సల్మాన్ అఘా అందుకున్నాడు. దీనిపై థర్డ్ అంపైర్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బాల్ చేతుల్లో కాకుండా నేలపై బౌన్స్ అయిందని… అసలు అది నాటౌట్ అంటూ ఇండియన్ ఫ్యాన్స్…. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అంపైర్లు పాకిస్తాన్ కు అమ్ముడుపోయారని మరికొందరు వాదిస్తున్నారు. అటు పాకిస్తాన్ ను ఆరాధించేవారు మాత్రం అది అవుట్ అని అంటున్నారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం….. దాన్ని సూర్య అవుట్ అని ఇచ్చాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ వెళ్ళిపోయాడు. అని అతని అవుట్ మాత్రం వివాదంగా మారింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ టీమిండియా మొత్తం 6 మ్యాచ్ లు ఆడితే.. అన్నిటిలో కలిపితే… టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 100 పరుగులు కూడా చేయలేదు. అత్యంత దారుణంగా విఫలమయ్యాడు సూర్య. ఇవాళ ఫైనల్స్ లో కూడా చెత్త బ్యాటింగ్ చేశాడు.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే
SHAHEEN SHAH GETS SURYAKUMAR YADAV…!!! 🔥
Outstanding catch by Captain Agha, Suarkumaar Yadav jis se hath nhin mila Raha tha usi ne catch pakar Lia, tyt chamaat yaar 😭😂 pic.twitter.com/7MRUD9e3mS— Umar Rao (@umar_says_) September 28, 2025