IND VS PAK Final : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ పోవడంతో పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లలో ఓవర్లలో 146 పరుగులు చేసింది. దీంతో టీమిండియా లక్ష్యం 147 పరుగులు కానుంది. దీంతో ప్రతీ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ తో ప్రారంభం చేసేది. అయితే గాయం కారణంగా ఇవాళ పాండ్యా మ్యాచ్ కి దూరం కావడంతో ఫస్ట్ ఓవర్ ఎవ్వరూ వేస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో శివమ్ దూబే తొలి ఓవర్ బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ తరువాత వచ్చిన బుమ్రా 7 పరుగులు ఇవ్వడంతో అప్పటి నుంచి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 9.4 ఓవర్ల వరకు కూడా ఒక్క వికెట్ కూడా పడలేదు.
Also Read : BCCI : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్… ఓజా, RP సింగ్ లకు కీలక పదవులు
శివమ్ దూబే వేసిన తొలి 3 బంతులు డాట్ కావడంతో ఈ ఓవర్ మెయిడెన్ అవుతుందని అంతా భావించారు. కానీ కాలేదు. పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ ఇవాళ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 9.4 ఓవర్ల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పర్హాన్ ఔట్ అయ్యాడు. ఫర్హాన్ ఔట్ అయిన తరువాత ఫఖర్ జమాన్ మెల్లగా రెచ్చిపోయాడు. టీమిండియా బౌలర్ ఎవ్వరైనా ప్రతీ ఓవర్ లో పక్కా 10 పరుగులు రాబట్టారు. 14.3 ఓవర్ లో వరుణ్ చక్రవర్తి ఫఖర్ జమాన్ ఔట్ చేయడంతో అప్పటి నుంచి మ్యాచ్ టర్న్ తిరిగింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ 17వ ఓవర్ లో 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ టర్నింగ్ తీసుకుంది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయడంతో పాకిస్తాన్ కి కళ్లెం వేసినట్టయింది. లేకుంటే పాక్ భారీ పరుగులు చేసేది.
ప్రారంభంలో భారీ పరుగులు సమర్పించుకున్న జస్ప్రిత్ బుమ్రా.. 18వ ఓవర్ లో, 20వ ఓవర్ తొలి బంతికి వికెట్లను తీసి 19.1 ఓవర్ లోనే పాకిస్తాన్ ని ఆలౌట్ చేశారు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ 57, ఫకర్ జమాల్ 46, సయిమ్ అయూబ్ 14, హారిస్ 0, సల్మాన్ అఘా 8, హుస్సెయిన్ తలాత్ 1, మహ్మద్ నవాజ్ 6, హారిస్ రవూఫ్ 6, అబ్రార్ 1 పరుగు చేశారు. దీంతో 19.1 ఓవర్ లో 146 పరుగులు చేసింది పాకిస్తాన్ జట్టు. ప్రారంభంలో పరుగులు సమర్పించుకున్న బుమ్రా 2, కుల్దీప్ యాదవ్ 4, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2 చొప్పున వికెట్లు తీశారు. దీంతో టీమిండియా విజయం సునాయసం చేశారు. తొలి 9 ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటింగ్ చూస్తే.. టీమిండియా ఓడిపోతుందనేలా ఓపెనర్లు ఆడారు. కీలక సమయంలో వరుణ్ చక్రవర్తి మ్యాచ్ ని టర్న్ చేయగా.. కుల్దీప్ యాదవ్ మరింత టర్న్ చేశాడు. చివర్లో బుమ్రా తన యార్కర్ తో వికెట్ ని కూల్చడంతో పాకిస్తాన్ ఆలౌట్ అయింది.