Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 దసరా ఎపిసోడ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఈ సీజన్ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది అని చూసే ఆడియన్స్ కి ఇదివరకే అర్థమయిపోయింది. పండగ సందర్భంగా టెనెంట్స్, ఓనర్స్ అని తేడా లేకుండా ఇద్దరినీ కలిపేశారు. దివ్య మరియు ఇమ్మానుయేల్ ఒక టాస్క్ కోసం కెప్టెన్లుగా వ్యవహరించారు.
హీరో హీరోయిన్ ఫొటోస్ చూపిస్తాను సినిమా పేరు చెప్పాలి అని టాస్క్ ను పెట్టారు. ఈ రౌండ్లో టీం రెడ్ అయిన ఇమ్మానుయేల్ టీం గెలిచింది. వాళ్లు గెలిచారు కాబట్టి వాళ్ళ టీం అయినా రీతూ చౌదరి కు వాళ్ల మదర్ వాయిస్ నోట్ మెసేజ్ వినిపించారు. ఎమోషనల్ అయిపోయిన రీతు చౌదరి.
నామినేషన్స్ లో ఉన్న వాళ్లను బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేయాలి అని చెప్పారు. మొదటగా హరీష్ ఓపెన్ చేశాడు నాట్ సేఫ్, తర్వాత రాము ఓపెన్ చేశాడు నాట్ సేఫ్. రీతు చౌదరి ఓపెన్ చేసి జోన్ లో ఉంది. ప్రియా శెట్టి ఓపెన్ చేసింది నాట్ సేఫ్ జోన్. కళ్యాణ్ ఓపెన్ చేశాడు నాట్ సేఫ్ జోన్. ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అలేఖ్య హారిక పర్ఫామెన్స్ చూపించారు.
ఆడియన్స్ ఒపీనియన్స్ హౌస్ మేట్స్ పైన ఎలా ఉంది అని నాగార్జున ఒక కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. హౌస్ మేట్స్ కి వినిపించారు. హౌస్ మేట్స్ దానికి ఆన్సర్ చేస్తే, అది జెన్యూన్ ఆన్సర్ కాదా అని స్టూడియోలో ఉన్న ఆడియన్స్ కన్ఫర్మ్ చేస్తారు. ముఖ్యంగా రీతు చౌదరి విషయంలో పవన్ కోసం గేమ్ ఆడుతుంది అని కామెంట్స్ వినిపించాయి. దానికి స్టూడియోలో ఆడియన్స్ కూడా అంగీకారం తెలిపారు
సుమన్ శెట్టి ఎక్కువగా గేమ్ లో కనిపించడం లేదు అనే కామెంట్స్ వచ్చాయి. సుమన్ శెట్టి నా ఆటను మెరుగుపరుచుకుంటాను అని చెప్పాడు. స్టూడియో ఆడియన్స్ కూడా అది జెన్యూన్ సమాధానమని ఎక్కువ శాతం మంది ఒప్పుకున్నారు.
హరీష్, దమ్ము శ్రీజ, కళ్యాణ్ ఇచ్చిన ఆన్సర్స్ కి స్టూడియో ఆడియన్స్ కూడా జెన్యూన్ లేదు ఓట్ చేశారు. అందరికంటే ఎక్కువగా ప్రియా శెట్టి ఇచ్చిన ఆన్సర్ ని 88% మెంబర్స్ జెన్యూన్ కాదు అని ఓట్ చేశారు.
నామినేషన్ లో ఉన్న కళ్యాణ్, ప్రియా శెట్టి, రాము రాథోడ్, హరీష్ ను బిగ్ బాస్ ముందుకు రమ్మని పిలిచి, ఒక ఆరో బాక్స్ ముందుకు తీసుకొచ్చారు. ఆరో బాక్స్ నుంచి ఆరో తీసినప్పుడు డౌన్ లో రెడ్ కలర్ వస్తే నాట్ సేఫ్ జోన్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్ జోన్ అని చెప్పారు.
దీనిలో హరీష్ కు గ్రీన్ కలర్ వచ్చి సేఫ్ జోన్ కి వెళ్ళిపోయారు. ఆరో నామినేషన్స్ తర్వాత తెలుసు కదా (Telusu Kada) చిత్ర యూనిట్ సిద్దు జొన్నలగడ్డ (Sidhu jonnalagadda) శ్రీనిధి శెట్టి, వైవా హర్ష , రాశిఖన్నా ఎంట్రీ ఇచ్చారు. తెలుసు కదా సినిమా టీజర్ ప్లే చేశారు. టీం కి విషెస్ చెప్పారు.
తెలుసు కదా సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి, హౌస్ లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి దివ్య చెప్పారు. అలానే సంజన కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పింది. అలానే తెలుసు కదా సినిమా యూనిట్ ముందు “కలిసుందాం రా” అనే టాస్క్ ఆడారు.
ఈ టాస్క్ లో భాగంగా స్నేక్ డాన్స్, మంకీ డాన్స్, డ్రంక్ డాన్స్, పులి డాన్స్ చేశారు. తరువాత ఇమ్మానుయేల్ ఇమిటేషన్ చేసి టీం ని నవ్వించాడు.
తెలుసు కదా యూనిట్ కూడా బిగ్బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో బతుకమ్మను ఏర్పాటు చేయాలని బిగ్ బాస్ సూచించారు. దీనికి న్యాయ నిర్ణయితగా సిద్దు వ్యవహరించారు. బ్లూ కలర్ టీం బతుకమ్మను బాగా ఏర్పాటు చేశారని సిద్దు డిసైడ్ చేశాడు. దసరా సందర్భంగా హౌస్ మేట్స్ కి అద్భుతమైన ఫుడ్ అందించారు. అలానే కోర్టు సినిమా ఫేమ్ శ్రీదేవి మరియు రోషన్ స్పెషల్ సాంగ్స్ తో ఎపిసోడ్లో అలరించారు. తరువాత కిరణ్ అబ్బవరం బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చారు. అతను నటిస్తున్న K Ramp సినిమా టీజర్ ను బిగ్ బాస్ లో ప్లే చేశారు.
ఇక కెప్టెన్సీ టాస్క్ లో హరీష్, పవన్, రీతు చౌదరి, రాము రాథోడ్, సంజన ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళ ముగ్గురికి బుట్ట బొమ్మ అనే ఒక టాస్క్ పెట్టారు నాగర్జున. ఈ టాస్క్ లో పవన్ గెలిచి కొత్త కెప్టెన్గా నిలిచాడు.
బాటమ్ రోలో ఉన్న కళ్యాణ్ మరియు ప్రియాను యాక్టివిటీ రూమ్ కి నాగార్జున ఇన్వైట్ చేశారు. ఆ రూమ్ లో ఒక సింహం ఉంది. ఆ సింహం ఎవరు వైపు చూసి గాండ్రిస్తుందో వాళ్లు సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని నాగార్జున చెప్పారు. ఇలా చెప్పగానే ప్రియా శెట్టి యాక్టివిటీ రూంలో చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. కళ్యాణ్ మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. మొత్తానికి కళ్యాణ్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ప్రియ ఎలిమినేట్ అయిపోయిన కూడా ఆమె ముఖంలో నవ్వు చెదరలేదు.
ప్రియా శెట్టి జర్నీ మొత్తాన్ని బిగ్ బాస్ చూపించారు. ఎలిమినేట్ అయిపోయిన కూడా స్ట్రాంగ్ గా నిలబడి నవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. బహుశా దీనిని ఎక్కువమంది ఎక్కువ ఇష్టపడి ఉండొచ్చు. 22 రోజుల నేను ఆ హౌస్ లో ఉన్నాను నేను ఇక్కడ వరకు రావడమే చాలా ఆనందంగా ఉంది అని ప్రియా శెట్టి చెప్పింది.
Also Read: The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి