Film Industry: సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బాలీవుడ్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్(Mahesh Manjrekars) ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలను చేసిన మహేష్ ఇంటా విషాదం నెలకొంది. ఈయన మాజీ భార్య దీపా మెహతా (Deepa Mehta)కన్నుమూశారు. ఇక ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దీప మెహతా కుమారుడు సత్య మంజ్రేకర్(Satya Manjrekar) సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన అమ్మ పాత ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సత్య “మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అమ్మ” అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజిని షేర్ చేశారు.
ఇలా సత్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈమె మరణ వార్త వెలుగులోకి వచ్చింది. ఇక ఈమె మరణం వార్తపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే దీప మెహతా మరణానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక దీప మెహతా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉండేవారు. మహేష్, దీప కాలేజీ చదివే రోజులలోనే ఇద్దరు మధ్య మంచి పరిచయం ఉండడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వీరిద్దరు 1987లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె అశ్వమి, కుమారుడు సత్య జన్మించారు. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన వ్యక్తిగత కారణాల కారణంగా ఇద్దరు 1995 లో విడాకులు తీసుకొని విడిపోయారు.
దీపా మెహతా నుంచి విడాకులు తీసుకున్న మహేష్ అనంతరం మేధాను రెండవసారి వివాహం చేసుకున్నాడు. మేధా మంజ్రేకర్ ఒక నటి. మేధా మరియు మహేష్ లకు సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉన్నారు. మహేష్ దీపా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలు అశ్వమి, సత్య ఇద్దరు కూడా తన తండ్రి వద్దే పెరిగారు. ఇక దీప క్వీన్ ఆఫ్ హార్ట్స్ అనే చీర బ్రాండ్‌ను నడిపారు. అప్పట్లో ఈమె చీరలకు ఎంతో డిమాండ్ ఉండేది. ఇక ప్రస్తుతం ఈ బ్రాండ్ కు వీరి కుమార్తె అశ్వమి మోడల్ గా వ్యవహరిస్తున్నారు.
అదుర్స్ సినిమాతో గుర్తింపు…
ఇలా ప్రముఖ దర్శకుడు ఇంట్లో విషాదం నెలకొంది అనే విషయం తెలియడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమె మరణ వార్త పై స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక మహేష్ బాలీవుడ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన తెలుగులో కూడా ఒక్కడున్నాడు, అదుర్స్(Adhurs) సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మహేష్ విలన్ పాత్ర అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తెలుగు సినిమాలలో పెద్దగా ఎక్కడ కనిపించలేదు.
Also Read: Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!