The Raja saab : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ స్థాయి , స్టామినా ఏ రేంజ్ లో ఉందో అందరికీ విధితమే. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు పొందుకున్నాడు అనడంలో సందేహం లేదు. కానీ ఫ్యాన్స్ సంతృప్తి పడేలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న ఒక్క సినిమాను కూడా ఇప్పటికి చేయలేదు.
నాకు అవకాశం దొరికితే ప్రభాస్ తో ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తా అని మారుతి ఒక ఇంటర్వ్యూలో చెప్పా. ఆ మాదిరిగానే రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది బాగా కిక్ ఇచ్చిన విషయం. కొద్దిసేపటికి క్రితమే ట్విట్టర్ వేదికగా అదిరిపోయే ట్వీట్ ఇచ్చి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు దర్శకుడు మారుతి.
మారుతి ట్విట్టర్ వేదికగా ఇప్పుడే ఇంట్రో సాంగ్ షూటింగ్ అయిపోయింది అని తెలియజేశాడు. ఒక్క పదంలో చెప్పాలి అంటే ఐ లవ్ యు డార్లింగ్ అంటూ వరుసగా లవ్ సింబల్స్ తో పాటు, ఫైర్ సింబల్స్ కూడా పెట్టాడు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ లో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
Finished Intro song shoot #TheRajasaab
Just a word
I love u darlingggggggggggggg
🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥— Director Maruthi (@DirectorMaruthi) September 28, 2025
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఏ విషయంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఈ సినిమాతో మరోసారి బయటపడబోతోంది.
ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో రానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా దీనిని కన్ఫామ్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది. అన్నింటినీ మించి ప్రభాస్ ఈ సినిమాలో అందంగా కనిపించడం అనేదే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి విడుదలైన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా ఈ సినిమాకు వచ్చాయి.
Also Read: OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్