Big Stories

Tips To Celebrate Holi: హోలీ ఆడాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

tips to celebrate holi
tips to celebrate holi

Tips To Celebrate Holi: హోలీ పండుగ కోసం దేశం ముస్తాబవుతోంది. రంగురంగుల పండుగను జరుపుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న రాబోయే హోలీ(రంగుల పండుగ) కోసం ఇప్పటికే ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. పల్లెటూర్లలో అయితే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని రోడ్లపై ఆటలాడుతూ ఎంజాయ్ చేస్తే.. సిటీల్లో ఈవెంట్స్ పేరిట సౌండ్ సిస్టమ్స్ అరెంజ్ చేసుకుని రంగులు పూసుకుంటూ మత్తు పానీయాలు సేవిస్తూ రెండు రకాలుగా హోలీ పండుగను ఆస్వాదీస్తుంటారు.

- Advertisement -

హోలీ ఆడే క్రమంలో చాలా మంది కళ్లు, చర్మం, పెదవుల గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆడుతుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలను కూడా కొనితెచ్చుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే హోలీ అంటే రంగుల పండుగే అయినా.. ఆ పండుగ సమయంలో పూసుకునే రంగులపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లలో దొరికే రసాయన రంగులను వాడకూడదని.. ఇంట్లో పండ్లు, ఇతరత్ర పదార్థాలతో తయారు చేసే రంగులను వాడాలని చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

- Advertisement -

హోలీ రంగుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  1. ఆర్గానిక్ కలర్స్:

హోలీ పండుగ సమయంలో ఉపయోగించే రంగుల్లో తేలిక పాటి రంగులను మాత్రమే ఉపయోగించాలి. ప్రకృతిలో లభించే సాధారణమైన రంగులను పూసుకోవడం ద్వారా చర్మంపై నుండి త్వరగా తొలిగిపోతాయి. రసాయనాలతో తయారుచేసిన రంగులను ఉపయోగించడం ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తేలికపాటి రంగులను ఉపయోగించాలి.

2. డ్రై హోలీ:

సాధారణంగా హోలీ అంటే రంగులతో పాటు నీటిని కూడా పోసుకుంటారు. వాటర్ బెలూన్స్, పిచికారీలు వంటివి ఉపయోగిస్తుంటారు. వేసవికాలం కాబట్టి నీటిని వృధా చేయకూడదు. నీటికి బదులుగా పువ్వులను ఉపయోగించడం మంచిది.

3. బెలూన్స్, ప్లాస్టిక్ బ్యాగ్ లకు దూరంగా ఉండాలి:

రంగులు పోసుకునేందుకు ఉపయోగించే పిచికారీలు పూర్తిగా ప్లాస్టిక్ తో తయారుచేస్తారు. వాటర్ బెలూన్స్ రబ్బర్ తో తయారు చేసి ఉంటాయి. వీటిని ఉపయోగించి భూమిని కాలుష్యానికి గురిచేయకుండా ఇకో ప్రెండ్లీ ఆప్షన్స్ చూసుకోవాలి. దీని వల్ల కాలుష్యం తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.

4. ఆహార పధార్థాల విషయంలో జాగ్రత్త:

హోలీ సమయంలో ఉపయోగించే స్వీట్స్, స్నాక్స్, దహీ భల్లే, గుజియాస్, మలుపా, పురన్ పోలీ, తండాయ్ వంటివి తీసుకోవడం మంచిది. అయితే వీటిని ప్లాస్టిక్ పాత్రల్లో మాత్రం స్టోర్ చేసి ఉంటే తీసుకోవద్దు. కేవలం పేపర్, నాచురల్ గా తయారు చేసిన వాటిలో స్టోర్ చేసిన ఆహార పదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News