Big Stories

Unlimited date with Rs 299 Recharge: క్రికెట్ వీక్షకులకు గుడ్ న్యూస్.. తక్కువ ధర.. ఎక్కువ డేటా.. ఐపీఎల్ కోసం బెస్ట్ ప్లాన్లు ఇవే!

jio 5g
jio 5g

Reliance Jio Unlimited data Recharge Plans: ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. క్రికెట్‌ను వీక్షించేందుకు స్పోర్ట్స్ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ఐపీఎల్ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఐపీఎల్‌ను ఎందులో చూడాలి? చూడటానికి ఏమైనా ఛార్జిలు వసూళు చేస్తారా అని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రముఖ రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా డేటా ఛార్జీలు కూడా భారీగా తగ్గాయి. అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్లు అనేక రీఛార్జ్ ప్లాన్లను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా అనేక సర్వీసులను తక్కువ ధరలో ఆఫర్ చేస్తోంది.

- Advertisement -

అయితే క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఐపీఎల్ 2024ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ మ్యాచ్‌లు అన్నింటినీ జియో సినిమా మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ఫ్రీగా లైవ్‌లో వీక్షించవచ్చు. దీనికి జియో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయదు.

Also Read: రూ.7 వేలలో తోపు ఫోన్లు.. మిస్ చేయకండి..!

కానీ ఈ సీజన్ ఐపీఎల్‌ను ఎలాంటి బఫరింగ్ లేకుండా స్ట్రక్ అవ్వకుండా చూడాలంటే మంచి స్పీడ్ కలిగిన ఫోన్‌లో డేటా ఫ్లాన్‌ను ఉంచుకోవాలసి ఉంటుంది. అందువల్ల జియో సిమ్ కలిగిన వారు అన్‌లిమిటెడ్ ప్లాన్లలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు అతి తక్కువ ధరలో ఉన్న డేటా ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో రూ.299లతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ ట్రూ 5G డేటా, డైలీ 2GB 5G హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 SMSలు వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. కాగా అన్‌లిమిటెడ్ ట్రూ 5G డేటాతో ఐపీఎల్ మ్యాచ్‌లను సూపర్ డూపర్ క్వాలిటీతో చూడవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది.

అలాగే రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 3GB 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 SMSలతో పాటు 6GB అదనపు డేటా కూడా లభిస్తుంది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్‌స్క్రిప్షన్స్ కూడా ఫ్రీగా లభిస్తుంది.

Also Read: ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

జియో రూ.667 ప్రీపెయిడ్ ప్లాన్. 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే ఇది డేటా వోచర్ మాత్రమే. ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్ కాల్స్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు. ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నవారు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 150GB డేటా లభిస్తుంది.

అలాగూ రూ.444 ప్రీపెయిడ్ ప్లాన్‌ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు 100GB డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News