E-Paper
Advertisement

Eyes Care Tips: ఇలా చేస్తే ఐ సైట్ తగ్గుతుంది తెలుసా ?

Eyes Care Tips: ఇలా చేస్తే ఐ సైట్ తగ్గుతుంది తెలుసా ?

Eyes Care Tips: కంటి చూపు అనేక కారణాల వల్ల తగ్గడం ప్రారంభమవుతుంది. చాలా సందర్భాలలో, చెడు జీవనశైలి దీనికి కారణం అవుతుంది. కొన్ని పద్ధతులు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బలహీనమైన కళ్ళు ఒక సాధారణ సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.

కళ్ళు బలహీనపడటానికి ప్రధాన కారణం మన చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. మీరు కూడా కంటి సమస్యతో బాధపడుతుంటే కనక మీ దినచర్య, అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం అవసరం. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నేటి బిజీ లైఫ్‌లో కళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌లు, చెడు ఆహారపు అలవాట్లు వంటివి అలవాట్లు కంటి ఆరోగ్యానికి హానికరం. కానీ కొన్ని సులభమైన పద్ధతులతో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు:

20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. ఇది కళ్లకు విశ్రాంతినివ్వడంలో సహాయపడుతుంది.

తగినంత నిద్ర: రోజు 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్ర కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. అంతే కాకుండా వాటిని రీఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది.

సమతుల్య ఆహారం: ఆకు కూరలు, పండ్లు, గింజలు కళ్ళకు చాలా మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే సమతుల్య ఆహారం తినాలి. వీటి వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తగినంత నీరు తీసుకోవడం: నీరు శరీరానికి చాలా అవసరం మరియు ఇది కళ్లను హైడ్రేట్‌గా ఉంచుతుంది. కంటి సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. అందుకే శరీరానికి తగినంత నీరు తాగడం చాలా అవసరం.

కంప్యూటర్ స్క్రీన్ నుండి దూరంగా ఉండండి: కంప్యూటర్ స్క్రీన్ నుండి కనీసం 25 అంగుళాల దూరంలో ఉండండి. తరుచుగా స్క్రీన్ చూడకుండా వర్క్ చేసే సమయంలో విరామం తీసుకోవడం చాలా మంచిది.

ఈ చిట్కాలు కూడా ఉపయోగపడతాయి:

మసక వెలుతురులో చదవడం: మసక వెలుతురులో చదవడం వల్ల కళ్లపై ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత వెలుతురులో చదవండి.

సన్ గ్లాసెస్ ధరించండి: సన్ గ్లాసెస్ UV కిరణాల నుండి కళ్ళను రక్షిస్తుంది.

రెగ్యులర్ కంటి చెకప్: సంవత్సరానికి ఒకసారి మీ కళ్ళకు చెకప్ చేసుకోండి.

కళ్లపై ఒత్తిడిని తగ్గించండి: టీవీ చూడటం, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, ఎక్కువసేపు పుస్తకాలు చదవడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది.

కంటి వ్యాయామాలు: కంటి కండరాలను బలోపేతం చేయడానికి కంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి.

Also Read: మీ చర్మం క్రమంగా నల్లగా మారుతోందా.. కారణాలివే!

కంటికి మేలు చేసే ఆహారాలు:
క్యారెట్
బచ్చలికూర
క్యాప్సికం
ఆరెంజ్
గుడ్లు
బాదం
చేపలు

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×