E-Paper
Advertisement

iQ00 13 : అదిరిపోయే డిజైన్ తో iQ00 13 లీక్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే

iQ00 13 : అదిరిపోయే డిజైన్ తో iQ00 13 లీక్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే
Advertisement

iQ00 13 : iQ00 13 స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంఛ్ కాబోతుంది. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ను ఆన్లైన్లో రిలీజ్ చేసింది ఈ సంస్థ. ఇక ఈ టీజర్ లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తో పాటు డిజైన్, లాంఛ్ డేట్ వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను తెలిపింది.

కాల్కమ్ నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్ సెట్ తో రాబోతున్న మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ iQ00 13. ఈ స్మార్ట్ ఫోన్లో అధునాతన ఫీచర్స్ తో పాటు అద్భుతమైన డిజైన్ ను సైతం ఈ సంస్థ జోడించింది. ఈ ఫోన్ అక్టోబర్ చివరి వారంలో చైనాలో ప్రారంభం కానుందని తెలిపింది.

Advertisement

iQ00 13 డిజైన్ – ఐక్యూర్ 13 స్మార్ట్ ఫోన్ డిజైన్ అత్యద్భుతంగా ఉంది. ప్రముఖ చైనీస్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారం విబోలో వినియోగదారుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫొటోస్ ను ఉంచాడు. ఇందులో ఈ హ్యాండ్ సెట్ లైవ్ ఇమేజెస్ తో పాటు క్లోజప్ ఇమేజెస్ సైతం కనిపిస్తున్నాయి. ఇక ఫ్లాట్ డిజైన్ తో నాలుగు వైపులా బెజెల్స్ తో ఈ ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వాల్యూమ్ రాకర్ తో పాటు స్క్రీన్ కుడి వైపున పవర్ బటన్, మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2K రిజల్యూషన్ డిస్ప్లేతో రాబోతున్న ఈ ఫోన్ లో డిస్ ప్లే తో అధునాతనంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. iQ00 నుంచి వచ్చే తదుపరి ఫ్లాగ్ షిప్ ఫోన్ 144hz రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది. 6.7 అంగుళాలు స్క్రీన్ తో రానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ALSO READ : అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్

కాల్కమ్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ తో ఈ ఫోన్ రాబోతుంది. స్నాప్ డ్రాగన్ 4 లేదా స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ గా పిలిచే సరికొత్త చిప్స్ సెట్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. ఇక 16 GB వరకు RAM ఎక్స్టెండ్ చేసుకునే సదుపాయం ఉందని… 512gb ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా – ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా క్వాలిటీస్ అయితే అత్యద్భుతంగా ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో రాబోతున్న ఈ ఫోన్.. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ అల్ట్రా వైడ్ 2ఎక్స్ కెమెరాలతో రాబోతుంది. ఇక 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా సైతం ఇందులో అందుబాటులో ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్ – ఈ స్మార్ట్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.  100w ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6150 బ్యాటరీ కలిగి ఉంది. ఇక అక్టోబర్ చివరలో చైనాలో లాంఛ్ కాబోతున్న ఈ ఫోన్ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ ధరను వెల్లడించనప్పటికీ… త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ పై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×