BigTV English

Aadi Saikumar: ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్‌కు ఆది ప్రమోషన్స్.. ఇదేదో కొత్త సినిమాలకు చేయొచ్చుగా!

Aadi Saikumar: ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్‌కు ఆది ప్రమోషన్స్.. ఇదేదో కొత్త సినిమాలకు చేయొచ్చుగా!

Aadi Saikumar: సినీ పరిశ్రమలో నెపోటిజం అనేది కామన్. అలా అని సపోర్ట్‌తో వచ్చిన వారసులంతా సక్సెస్ అవుతారని గ్యారెంటీ లేదు. ఎంత సపోర్ట్ ఉన్నా.. వారికి లక్ కూడా కలిసి రావాలి. ఒకవేళ అలా జరగకపోతే వారు ఏడాదికి ఎన్ని సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వడం కష్టమే. సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ‘ప్రేమకావాలి’ అనే సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఆదికి మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందింది. కానీ ఆ తర్వాత నుండి ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడు ‘ప్రేమకావాలి’ (Prema Kavali) రీ రిలీజ్ కోసమే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు ఆది. దీంతో తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.


ఫేస్‌బుక్‌లో పోస్ట్

ఆది (Aadi).. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అందులో చాలావరకు సినిమాలు అసలు ప్రేక్షకులకు తెలియదు. దానికి కారణం ప్రమోషన్స్ సరిగా చేయకపోవడమే. ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలతో కచ్చితంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతాడు ఆది. కానీ వాటికి ప్రమోషన్స్ విషయంలో మాత్రం పెద్దగా శ్రద్ధ తీసుకోడు. అందుకే తన చిత్రాలకు ప్రేక్షకుల రీచ్ ఎక్కువగా ఉండదు. దానివల్ల అవి ఆటోమేటిక్‌గా ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు ‘ప్రేమకావాలి’ రీ రీలీజ్ కోసం ఏకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినా ఆది.. తన కొత్త సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎందుకిలా ఇంట్రెస్ట్ చూపించడం లేదని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Also Read: ప్రభాస్ ‘స్పిరిట్ ‘ మూవీ షూటింగ్ షురూ .. ఫ్యాన్స్ బీ రెడీ.. !

బుకింగ్స్ ఓపెన్

అక్టోబర్ 26న ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్ కానుంది. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం మూడు థియేటర్లలో విడుదల అవుతోంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో, వైజాగ్‌లోని సంగంలో, విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో మాత్రమే ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ థియేటర్లలో టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యిందని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ఆది. ఈ మూవీకి, ఇందులో పాటలకు తెలుగులో చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ‘ప్రేమకావాలి’ని మరోసారి థియేటర్లలో చూడడానికి ఆడియన్స్ సిద్ధమవుతున్నారు. అలా కెరీర్‌లోని ఒకేఒక్క హిట్ సినిమాకు ప్రమోషన్స్ చేస్తూ దాంతోనే తృప్తి చెందుతున్నాడు ఆది.

తగ్గేదే లే

‘ప్రేమకావాలి’ తర్వాత ‘లవ్‌లీ’ అనే మూవీలో నటించాడు ఆది సాయికుమర్. అది కూడా కాస్త పరవాలేదనిపించింది. యావరేజ్ హిట్‌గా నిలిచింది. దాని తర్వాత మాత్రం ఆదికి లక్ అస్సలు కలిసి రాలేదు. 2011లో ‘ప్రేమకావాలి’ రిలీజ్ అయ్యింది అప్పటినుండి ఇప్పటివరకు ఆది కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా రాలేదు. తను నటించిన కొన్ని సినిమాల గురించి అయితే ప్రేక్షకులకు అస్సలే తెలియదు. అయినా కూడా ఏ మాత్రం స్లో అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆది ఖాతాలో మూడు సినిమాలలు ఉన్నాయి. ‘జంగిల్’ అనే చిత్రంతో తొలిసారి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించనున్నాడు ఆది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×