E-Paper
Advertisement

Boti Curry: తెలంగాణ స్టైల్లో బోటీ కూర చేశారంటే వదల్లేరు, కళాయి మొత్తం ఊడ్చేస్తారు

Boti Curry: తెలంగాణ స్టైల్లో బోటీ కూర చేశారంటే వదల్లేరు, కళాయి మొత్తం ఊడ్చేస్తారు
Advertisement
బోటీ కూర ఎంతో మందికి ఫేవరెట్. నాన్ వెజ్ ప్రియులు నెలలో ఒకసారైనా బోటీ కూర తినేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇది అందరికీ వండడం రాదు. తెలంగాణ స్టైల్లో బోటీ కూర ఎలా వండాలో ఇక్కడ చెప్పాము. దీన్ని ఒక్కసారి వండుకుంటేనే మీకు నోరూరిపోతుంది. మసాలా దట్టించి చేసే బోటి కూర రెసిపీ తెలుసుకోండి.

బోటి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
బోటి – అరకిలో
నూనె – మూడు స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
టమాటాలు – రెండు
లవంగాలు – నాలుగు
మరాఠీ మొగ్గ – ఒకటి
దాల్చిన చెక్క – చిన్న ముక్క
ధనియాలు – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
కారం – ఒకటిన్నర స్పూను
పసుపు – చిటికెడు

బోటి కూర రెసిపీ
1. బోటిని పరిశుభ్రంగా కడిగి నీటిలో వేసి ఉప్పు కలిపి బాగా శుభ్రపరచాలి.
2. ఇప్పుడు బోటీని ఒక గిన్నెలో వేసి మంచినీళ్లు వేసి ఉప్పు వేసి బాగా కలపాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి.
3. ఉడికిన తర్వాత బోటీలో ఉన్న వ్యర్థాలను పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవాలి.
4. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
7. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించాలి.
8. ఆ తర్వాత పసుపు వేయాలి. తరువాత బోటీ ముక్కలను వేసి బాగా కలపాలి.
9. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపాలి.
10. పైన మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ లోపు ధనియాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జీలకర్ర మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
11. ఈ పొడిని కూడా కూరలోనే వేసి బాగా కలపాలి.
12. ఇది మొత్తం ఇగురు లాగా అవుతుంది.
13. ఇప్పుడు టమోటాలను చిన్న ముక్కలుగా తరిగి అందులోనే వేసి బాగా కలపాలి.
14. ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీళ్లను వేసి పైన మూత పెట్టి విజిల్ పెట్టేయాలి.
15. ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
16. మూత తీసాక బోటి కూర ఇగురు లాగా దగ్గరగా వచ్చేవరకు మళ్లీ ఉడికించాలి.
17. పైన కొత్తిమీర తరుగున చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే బోటీ కూడా రెడీ అయినట్టే.

బోటి కూర వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్టీగా ఉంటుంది. దీన్ని శుభ్రపరచడంలోనే పనంతా ఉంటుంది. చాలామందికి బోటీ కూర శుభ్రపరచడం రాదు. కాబట్టి వేడి నీటిలో పూర్తిగా శుభ్రపరిచాకే వండుకోవాలి. లేదా ముందుగానే ముక్కలుగా కట్ చేయించి వేడినీటిలో ఉడకబెట్టి చేతితోనే శుభ్రపరచాలి. ఈ బోటీ కూరను బగారా రైస్ తో తింటే రుచి అదిరిపోతుంది. కాబట్టి వేడి వేడి బగారా రైస్ లో ఈ ఇగురును తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×