BigTV English

YCP in Manyam: మాజీ మంత్రి భర్త సిత్రాలు.. మన్యం వైసీపీలో టెన్షన్ టెన్షన్..

YCP in Manyam: మాజీ మంత్రి భర్త సిత్రాలు.. మన్యం వైసీపీలో టెన్షన్ టెన్షన్..

YCP in Manyam: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆ జిల్లా రెండు ముక్కలైంది. వైసీపీ హయాంలో రెండు జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించింది. ఇప్పటికీ ఆ ఇద్దరే అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఒక జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేడర్‌కి నేనున్నా అని భరోసా ఇస్తుంటే.. రెండో చోట మాత్రం చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ జిల్లా పార్టీ వర్గాలు కూడా పక్క జిల్లా అధ్యక్షుడిపైనే పనుల కోసం ఆధారపడాల్సి వస్తుందంట. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడంటారా? లెటచ్ వాచ్.


2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక విజయనగరం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రెండు జిల్లాలకు ఇద్దరు పార్టీ అధ్యక్షులను నియమించింది . విజయనగరం జిల్లాకి మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లాకు అప్పటి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భర్త అయిన శత్రుచర్ల పరిక్షిత్ రాజును నియమించారు. మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులే. బొత్స మేనల్లుడుగా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైసీపీలో మామతో కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. సొంత జిల్లాలో కార్యకర్తలకు, నాయకులకు ఆయన నేనున్నానే భరోసానిస్తున్నారు . ఎల్లపుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ పార్టీ భాధ్యతలు భుజాన వేసుకున్నారు.

కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇద్దరికీ అస్సలు పొంతన లేదట. చిన్న శ్రీనుని, పరిక్షిత్ రాజు ని ఒకరితో ఒకరిని అస్సలు పోల్చలేము అంటున్నాయి మన్యం వైసీపీ వర్గాలు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ , కూటమి ప్రభుత్వంపై చిన్న శ్రీను ఒంటి కాలుపై లేస్తుంటే పరిక్షిత్ రాజు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారట. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల మేరకే కార్యక్రమాలు తప్ప ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవట. ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించిన పాపాన కూడా పోలేదట. కనీసం జిల్లా కేంద్రానికి వచ్చి నాయకులు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదంట. దీంతో అటు నాయకులు, కార్యకర్తల్లో కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళం నెలకొంది.


రాజకీయ విమర్శలు కాకపోయినా విధానపరంగా కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో పార్టీ పునరోత్తేజం కోసం ఏరోజు ఏ ఒక్కరినీ కలిసి మాట్లాడిన సందర్భం లేదన్న ఆరోపణలు జోరందుకున్నాయి. ఆ క్రమంలో పరిక్షిత్ రాజు జిల్లా అధ్యక్షుడుగా అవసరమా అన్న ప్రశ్నలు పార్టీ వర్గాలలో తలెత్తుతున్నాయి. జిల్లాలో పార్టీ పగ్గాలను ఇంకెవరైనా యాక్టివ్ గా ఉండే నేతకు అప్పగిస్తే వచ్చే ఎన్నికలు మాట దేవుడెరుగు కనీసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకైనా పార్టీలో జీవం పోస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మాజీ మంత్రిగా పుష్ప శ్రీవాణి అప్పుడప్పుడైన యాక్టివ్ గా కనిపించినా.. ఆమె భర్త పరిక్షిత్ రాజు మాత్రం మౌన మునిలా వ్యవహరించడంతో పార్టీ శ్రేణుల నుండి విమర్శలు వస్తున్నాయి.

Also Read: వైసీపీ నేతలను కలవరపెడుతున్న కేసుల భయం.. ఇన్చార్జ్‌లు మిస్సింగ్..?

ఇప్పటికే కూటమి దెబ్బకి కంచుకోటలా ఉన్న జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ అయితే.. పరిక్షిత్ రాజు మాత్రం ఎలాంటి సమీక్ష చేసుకోకుండా నిద్రమత్తు ఆవహించినవారిలా నిశ్శబ్దంగా ఉండడం పార్టీలో కొందరి నేతలకు చిరాకు తెప్పిస్తోందట . అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన వారు, అధికారం పోయాక ఇలా ఇళ్ళకే పరిమితవడం సమంజసమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిక్షిత్ రాజు సైలెన్స్ పాటిస్తుండడంతో మన్యం నాయకులు తమ కష్టాలను విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన్న శ్రీను దగ్గర, అవకాశం ఉంటే శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దగ్గర వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందట.

ఇప్పటికైనా పార్టీ జిల్ల అధ్యక్షుడు నిద్ర మత్తు వీడడమో, లేక పార్టీ అధినాయకత్వం కొత్త అధ్యక్షుడుని నియమించడమో చేస్తే బాగుంటుందని మన్యం వైసీపీ కేడర్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అభిప్రాయంతో ఉన్నారట సదరు మన్యం వైసీపీ కేడర్ .. మరి ప్రస్తుత అధ్యక్షుడు వేక్అప్పా.. లేక ప్యాకప్పా అన్నది చూడాలి.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×