Gundeninda GudiGantalu Today episode January 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రతి సంసారంలో మంచి చెడులు, కోపం శాంతం వంటివి ఉంటాయి వాటిని సర్దుకుపోవడమే జీవితం అని చెబుతుంది. తాను అన్నిటిని భరిస్తానని మౌనిక సమాధానం ఇస్తుంది. సువర్ణ మాత్రం ఈ పిచ్చి పిల్లను ఈ దుర్మార్గుడు ఎలా బాధలు పెడతాడో అని భయపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. బాలు కోసం వెతుక్కుంటూ వెళ్లిన మీనా నచ్చచెప్పి ఇంటికి తీసుకొని వస్తుంది.. ఇంట్లో వాళ్ళందరూ బాలు పై కోపంగా ఉంటారు. ప్రభావతి కనీసం మొహం కూడా చూడదు. ఇంట్లో ఉన్న అందరు బాలు పై కోపంగా ఉంటారు. సత్యం మాత్రం బాలు చేసిన దాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్యం చెప్పినా ప్రభావతి మాత్రం వినదు. ఇక ఇంట్లో అందరు బాధ పడతారు. అటు శోభనానికి నీలకంఠం అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూజ చేయించి మౌనికను సువర్ణ గదిలోకి పంపిస్తుంది. అక్కడకు ఎంటర్ అవ్వగానే తాగడం చూసి షాక్ అవుతుంది. శోభనం గదిలో పాలు ఎందుకు పెగ్ పంచుకుందాం అంటాడు. సంజు నిజ స్వరూపం బయట పెడతాడు. మీ బాలుకు బుద్ది చెప్పాలనే నీ మెడలో తాళి కట్టానని చెప్తాడు. అసలు ప్లాన్ ఏంటి అనే దాన్ని గురించి మౌనికకు చెబుతాడు. శోభనం గదిలోకి కోటి ఆశలతో వచ్చిన మౌనికకు భారీ షాక్ తగిలింది.. సంజు ప్లాన్ సక్సెస్ అయ్యిందని ఖుషి అవుతాడు. మౌనిక మాత్రం గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మీనా బాలును ఇంటికి తీసుకొని వస్తుంది. ప్రభావతి పెద్ద రచ్చ చేస్తుంది.. మీనా సపోర్ట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గదిలోకి తీసుకెళ్లిన మీనా బాలుని ఓదారుస్తుంది కానీ బాలు మాత్రం తన చెల్లిని ఒక దుర్మార్గుడికి ఇచ్చాడంటూ బాధపడుతూ ఉంటాడు. మౌనిక సంతోషంగా ఉంటుంది మౌనికకు మనందరం ఉన్నాం వాడు నీ జోలికి రాడు నువ్వు మౌనికని ఇబ్బంది పెడితే కొడతావని వారికి తెలుసు కదా ఇక మీరు నిక్షింతగా ఉండండి ఫస్ట్ భోజనం చేయండి అని ఓదారుస్తుంది. మీనా మాట విన్న బాలు భోజనం చేస్తాడు. మౌనికను తను అత్తింటికి ఎంత గౌరవంగా పంపాలని ఎన్నో కలలుగన్నాను. ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకొని మౌనికకు గాజులు కూడా కొన్నానని బాలు మీనాకు చూపిస్తాడు. మౌనిక సంతోషంగా ఉంటుంది ఈ గాజులు మీరే మౌనిక చేతికి వేస్తారు అని మీనా అంటుంది. ఇక బాలు మీనా ఒడిలో పడుకొని నిద్రపోతాడు. సువర్ణ మౌనికను పూజ చేసావా అని అడుగుతుంది. ఇప్పటివరకు కోడలుగా ఇంట్లో నేను దీపం పెట్టాను ఇక మీదట నుంచి నువ్వే దీపం పెట్టాలి ఇది మర్చిపోవద్దు అనేసి మౌనికకు చెప్తుంది. సంజయ్ ప్రవర్తనకు భయపడుతున్నావా భయపడొద్దు నీకు సపోర్టుగా నేనుంటాను నువ్వు నీ ప్రేమతో మార్చుకో నువ్వు మంచి దానివి నీ ప్రేమతో మారిస్తే వాడు మారతాడు అనేసి భరోసా ఇస్తుంది. మౌనిక అత్తయ్య మాటలకి పొంగిపోతుంది.
ఇక ఉదయం సుశీలమ్మ బయలుదేరుతూ ఉంటుంది. బాలు దగ్గరికి వస్తుంది. కానీ, బాలు పడుకొని ఉండటంతో మీనాతో మాట్లాడుతుంది. ‘రాత్రి నీ మొగుణ్ణి అంటే ఎంత కోపం వచ్చిందే.. ఇన్ని రోజులకు ధైర్యం వచ్చింది. నువ్వు ఎలాగైనా నీ మొగుడిని జాగ్రత్తగా చూసుకుంటావని ధైర్యం నాకు వచ్చింది’ అని, బాలుని జాగ్రత్తగా చూసుకోమని సుశీలమ్మ అంటుంది. తర్వాత సత్యం దగ్గరికి వచ్చి.. తాను బయలుదేరుతున్నానని చెబుతోంది. వెళ్లే ముందు రవి శృతిలను ఎప్పుడు ఇంటికి తీసుకు వస్తున్నామని సత్యాన్ని అడుగుతుంది. సత్యం సరే అని అంటాడు. ఇక ప్రభావతి కూడా సుశీలమ్మ చెప్తుంది. మౌనిక ప్రేమతోనే బాలు మీనా అలా చేశారు అంతేకానీ వాళ్ళిద్దరికీ శత్రుత్వం లేదు వాళ్ళిద్దరూ నీకు మీదట ఏమీ అనద్దు ప్రభా అనేసి చెప్తుంది.
సంజును నిద్ర లేపడానికి మౌనిక గదిలోకి మళ్ళీ వస్తుంది. శోభనం రాత్రి అన్న మాటలను గుర్తుకు చేసుకుంటూ బాధపడుతుంది. నిద్ర లేపాలా వద్దా అని భయపడుతుంది. ఈ సమయంలో తన చేయి తాకి.. ఫ్లవర్ వాజ్ కింద పడుతోంది. దీంతో సంజూ నిద్ర లేస్తాడు. అనవసరంగా తన నిద్రను డిస్టర్బ్ చేసావ్.. అంటూ మీ నాపై మండిపడతాడు. తాను కాఫీ తెచ్చానని చెబుతోంది మౌనిక. ‘నీ కాఫీ ఎవడికి కావాలి అని, ఆ కాపీని పారబోసి.. అందులోనే మందు పోసుకుని.. హ్యాండ్ ఓవర్ పెగ్గు అంటూ పొద్దున్నే మందు తాగుతాడు. సంజును అసహ్యంగా చూస్తుంది మౌనిక.. మీ అన్నయ్య కూడా తాగుతాడు కదా..’ అని బాలుని అవమానిస్తాడు సంజు. తన అన్నయ్య పొద్దంతా కష్టపడి.. రాత్రి ఆ కష్టాన్ని మరిచిపోవడానికి తాగుతాడు. నీలాగా పొద్దున్నే లేవగానే తాగడు అని అంటుంది. దీంతో నోరు లేస్తే పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయని సంజు వార్నింగ్ ఇస్తుంది..ఇక బాలు ఉలిక్కిపడి లేస్తాడు. మౌనిక అని అరుస్తాడు మీనా ధైర్యం చెబుతుంది మౌనిక అక్కడ ఇబ్బంది పడుతుందని బాలు మీనాక్షి బయలుదేరుతాడు.. ఇక బాలు ఆవేశంగా వెళ్లడం చూసి ప్రభావతి ఆపుతుంది ఇంట్లో అందరూ బాలుని తిడతారు. ప్రభావతి మీనా ను బాలునిద్దరిని కలిపి తిడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇప్పుడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..