సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు
సొరకాయ – ఒకటి
బాదం పప్పులు – గుప్పెడు
జీడిపప్పు – గుప్పెడు
ఎండు ద్రాక్షలు – గుప్పెడు
పాలు – లీటరున్నర
నెయ్యి – రెండు స్పూన్లు
పంచదార – ఒక కప్పు
యాలకుల పొడి – అర స్పూను
సొరకాయ హల్వా రెసిపీ
1. సొరకాయ హల్వా చేసేందుకు లేత సొరకాయను ఎంపిక చేసుకోవాలి. పైన చెక్కును తీసేసి గింజలను తీసి పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు సొరకాయను చిన్నగా తురుముకోవాలి. ఆ తురిమిన సొరకాయను ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.
3. కాసేపటికి అందులోంచి నీరు దిగుతుంది. ఆ నీటిని పిండి ఆ సొరకాయ తురుమును పక్కన పెట్టుకోవాలి.
4. బాదం పప్పులు, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వంటివన్నీ కూడా సన్నగా తరగాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పాలు పోయాలి.
6. పెద్ద మంట మీద ఆ పాలను మరిగించాలి. అవి సగానికి పైగా తగ్గిపోయే వరకు మరిగిస్తూనే ఉండాలి.
7. అలా పాలు అర లీటర్ అయ్యేంతవరకు ఉంచాలి.
8. పాలు మరుగుతున్నప్పుడు మరొక బర్నర్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
9. ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో సొరకాయ తురుమును వేసి బాగా వేయించుకోవాలి.
11. తడి మొత్తం పోయి సొరకాయ దగ్గరగా అయ్యేంతవరకు వేయించాలి.
12. అందులోనే పంచదారను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. ఇది జిగురుపాకం వచ్చేవరకు బాగా కలపాలి.
14. ఇప్పుడు మరుగుతున్న పాలను ఈ సొరకాయ మిశ్రమంలో వేయాలి.
15. పాలు అప్పటికే చిక్కగా మారి ఉంటాయి. ఇప్పుడు సొరకాయ మిశ్రమాన్ని పాలల్లో బాగా కలపాలి.
16. యాలకుల పొడిని వేసి పావుగంట సేపు ఉడికిస్తే అది దగ్గరగా హల్వాలాగా అవుతుంది.
17. ఇప్పుడు ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను ఒక స్పూను నెయ్యిని వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయినట్టే.