E-Paper
Advertisement

Walnuts For Skin: వాల్‌నట్స్‌తో మెరిసే చర్మం.. ఎలాగంటే ?

Walnuts For Skin: వాల్‌నట్స్‌తో మెరిసే చర్మం.. ఎలాగంటే ?
Advertisement

Walnuts For Skin: వాల్ నట్‌లను పోషకాల నిధి అని కూడా అంటారు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా వాల్ నట్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మానికి కూడా ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి.

అందమైన , మెరిసే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. దీని కోసం రకరకాల ప్రొడక్ట్స్ కూడా వాడతారు. కానీ వీటిని వాడటం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే వాల్ నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. వాల్ నట్స్ పోషకాలు సమృద్దిగా ఉండే సూపర్ ఫుడ్. ఇందులో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు , విటమిన్ ఇ, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా , యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

Advertisement

మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాము. కానీ డ్రై ఫ్రూట్ తినడం మరిచిపోతుంటాము. వీటి ప్రత్యేకతలు చాలా మందికి తెలియవు. చిన్నగా కనిపించే ఈ డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి. డ్రై ప్రూట్స్ లో ఒకటైన వాల్ నట్స్‌ను నానబెట్టి కూడా తినవచ్చు. వాల్ నట్స్ నానబెట్టి తినడం వల్ల చర్మానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్ నట్స్ తినడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు:

Advertisement

ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు , వాల్ నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుల నుండి హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.

విటమిన్ ఇతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ , ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తుంది. ఇది ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read: చుండ్రు సమస్యకు ఈ ఆయిల్‌తో.. శాశ్వత పరిష్కారం

విటమిన్ బి కాంప్లెక్స్ కూడా వాల్ నట్స్‌లో ఉంటుంది. ఇది చర్మ కణాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం సహజ మెరుపును ఇస్తుంది.

జింక్ చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలను తగ్గించడంలో దోహదం చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలను కలిగించే నూనెల ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది.

Related News

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

Big Stories

Advertisement
×