BigTV English

Olive Oil For Dandruff: చుండ్రు సమస్యకు ఈ ఆయిల్‌తో.. శాశ్వత పరిష్కారం

Olive Oil For Dandruff: చుండ్రు సమస్యకు ఈ ఆయిల్‌తో.. శాశ్వత పరిష్కారం

Olive Oil For Dandruff: చలికాలంలో చుండ్రు సమస్యను ఎదుర్కునే వారు మనలో చాలా మందే ఉంటారు. చల్లని గాలి ఈ సీజన్‌లో స్కాల్ప్‌ని పొడిగా చేస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు.


చలికాలంలో వచ్చే చుండ్రు సమస్యను ఎదుర్కోవడానికి ఆలివ్ ఆయిల్ చాలా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. దీనిలో కొన్ని రకాల పదార్థాలను కలపడం వల్ల కూడా చుండ్రు సమస్య నుండి పూర్తిగా బయటపడొచ్చు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఆలివ్ ఆయిల్, అలోవెరా :
కావాల్సినవి:
అలోవెరా – 2 టీ స్పూన్లు
ఆలివ్ ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు


ఎలా ఉపయోగించాలి ?
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. తర్వాత 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి.

అలోవెరా మాయిశ్చరైజింగ్‌తో పాటు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని ఆలివ్ ఆయిల్ లో అప్లై చేసి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు త్వరగా తగ్గాలంటే ఈ హోం రెమెడీని వాడటం మంచిది.

2. ఆలివ్ ఆయిల్, తేనె:

కావాల్సినవి:

ఆలివ్ ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 2 టేబుల్ స్పూన్లు

ఎలా అప్లై చేయాలి ?
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగిన తర్వాత తలస్నానం చేయండి.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది తలకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా మూలాల నుండి చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది.

3. ఆలివ్ ఆయిల్ , కొబ్బరి నూనె
కావాల్సినవి:
ఆలివ్ ఆయిల్ – 1 టీస్పూన్
కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్

ఎలా ఉపయోగించాలి ?

పైన చెప్పిన పదార్థాలను ముందుగా ఒక బౌల్ లో తీసుకుని మిక్స్ చేయాలి. తర్వాత జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రును తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త వేడి చేసి జట్టుకు అప్లై చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా జుట్టు కూడా పెరుగుతుంది.

Also Read: ఇలా చేస్తే చాలు.. మిల్కీ వైట్ స్కిన్ మీ సొంతం

4. ఆలివ్ ఆయిల్, ఎగ్ :
కావల్సినవి:
ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు
ఎగ్ – 1
ఎలా ఉపయోగించాలి ?
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎగ్ లోని పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి. అంతే కాకుండా చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×