మీరు వెళ్లాల్సిన రైలు జీవితం కాలం లేటు అంటూ గతంలో చాలా మంది భారతీయ రైల్వే మీద జోకులు వేసుకునే వాళ్లు. ఏ రైలూ చెప్పిన సమయానికి రాదంటూ నిట్టూర్చే వాళ్లు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా పద్దతి పూర్తిగా మారింది. రైళ్లు టైమ్ టేబుల్ ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి. అనుకున్న సమయానికి బయల్దేరడంతో పాటు నిర్ణీత సమయానికి గమ్యస్థానికి చేరుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో రైలు రావాల్సిన సమయం కంటే కొద్ది నిమిషాలు, లేదంటే కొన్ని గంటలు ఆలస్యం అవుతాయి. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం, ఏవైనా ప్రమాదాలు జరగడం, ఇంకా ఇతర కారణాల వల్ల రైళ్లు ఆయా స్టేషన్లలో ఆపేస్తారు.
రైల్వే మీద భారీగా ఆర్థిక భారం
రైళ్లు పలు కారణాలతో ఆగడం వల్ల రైల్వే సంస్థ మీద అధికంగా భారం పడుతుంది. నిమిషానికి ఒక్కో రైలుకు వేల రూపాయలు నష్టం వాటిళ్లుతుంది. ప్యాసింజర్ రైళ్లతో పోల్చితే, గూడ్స్ రైళ్లకు నష్టం కాస్త తక్కువగానే ఉంటుంది. ఇంతకీ ఒక నిమిషం పాటు రైలు ఆగడం వల్ల ఎంత నష్టం వాటిళ్లుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నిమిషం రైలు ఆగితే ఎంత నష్టం కలుగుతుంది?
రైలు ఒక్క నిమిషం పాటు ఆగడం వల్ల రైల్వే సంస్థకు వేల రూపాయాల్లో నష్టం కలుగుతుంది. ఈ నష్టం డీజిల్, విద్యుత్ కు వేర్వేరుగా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ ప్యాసింజర్ రైలు నిమిషం ఆగితే రైల్వే శాఖకు సుమారు రూ. 20,401 నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. విద్యుత్ తో నడిచే రైళ్లు నిమిషం ఆగితే రూ. 20,459 నష్టం కలుగుతుంది. ప్యాసింజర్ రైళ్లతో పోల్చితే గూడ్స్ రైళ్లకు కాస్త తక్కువగా నష్టం కలుగుతుంది. డీజిల్ గూడ్స్ రైలు నిమిషం ఆగితే రూ. 13,334 నష్టం కలుగుతుంది. విద్యుత్ తో నడిచే గూడ్స్ ట్రైన్ కు నిమిషానికి రూ. 13,392 నష్టం కలుగుతుంది. ఏ కారణంతోనైనా రైలు ఆగితే, మళ్లీ అది తన పూర్తి వేగాన్ని అందుకునేందుకు సుమారు 3 నిమిషాల సమయం పడుతుంది. రైలు స్పీడ్ అందుకునే క్రమంలో డీజిల్, లేదంటే విద్యుత్ ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. ప్రయాణ సమయంలో రైలు ఏ కారణం లేకుండా ఆగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిళ్లుతుందంటున్నారు రైల్వే అధికారులు.
Read Also: దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు.. గంటకు దీని వేగం ఎంతో తెలుసా?
ఒక రైలు ఏదైనా కారణంతో ఆగిపోతే, దాని ప్రభావం ఆ రూట్లో నడిచే ఇతర రైళ్ల మీద పడే అవకాశం ఉంటుంది. ఒక రైలు ఓ స్టేషన్ లో ఆగిపోతే, ఆ రైలు క్లియర్ అయ్యేంత వరకు స్టేషన్ మాస్టర్ మిగతా రైళ్లను అనుతించరు. ఒక వేళ ఏదైనా రైలును ముందు పంపించాలంటే రైల్లే స్టేషన్ లోని మరో ట్రాక్ లోకి ఆగాల్సిన రైలును తీసుకుంటారు. ఆ తర్వాత అత్యవసర రైలును పంపిస్తారు. ఆ తర్వాత నిలిచి ఉన్న రైలు వెళ్లేందుకు అనుమతిస్తారు.
Read Also: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్, రోజూ ఇక్కడ రైళ్లు కూడా ఆగుతాయండోయ్!