E-Paper
Advertisement

Liquor Mixing Gang: కాస్ట్‌లీ బాటిల్స్‌లో చీప్ లిక్కర్.. కల్తీ మద్యం మిక్సింగ్ ముఠా గుట్టురట్టు

Liquor Mixing Gang: కాస్ట్‌లీ బాటిల్స్‌లో చీప్ లిక్కర్.. కల్తీ మద్యం మిక్సింగ్ ముఠా గుట్టురట్టు
Advertisement

Liquor Mixing Gang: తక్కువకు దొరుకుతుందని మద్యం కొంటున్నారా అయితే అనారోగ్యం పాలైనట్లే.. బార్‌లు, రెస్టారెంట్లలో తాగి పడేసిన ఖరీదైన సీసాలు స్వీకరించి, అందులో చీప్ లిక్కర్ నింపి.. అదే బ్రాండ్ పేరుతో అధిక ధరలకు అమ్మకాలు జరిపే ముఠాను శంషాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు.

ఎక్సైజ్ శాఖ తనిఖీలొ భాగంగా.. పెద్ద మొత్తంలో 139 మిక్సింగ్ చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లు, 136 ఖాళీ ప్రీమియం సీసాలు, రూ.8 లక్షల విలువైన మద్యం సామాగ్రి, మూడు స్కూటీలు సీజ్ చేయడంతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు.

Advertisement

విశ్వసనీయ సమాచారం మేరకు.. శంషాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాసరెడ్డి, డీటీఎప్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సిబ్బంది ప్రకృతి, మల్లేష్‌, నెహ్రు, గణేష్‌, సాయిశంకర్‌, శేఖర్‌లు గచ్చిబౌళి ప్లైఓవర్‌, ఇందిరానగర్‌ రూట్‌వాచ్‌ నిర్వహించారు.

ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై.. 15 బెన్‌విచ్‌ మద్యం బాటిళ్లను తీసుకెళుతున్నట్లు కనిపించారు. వాటిని పరీక్షించగా విలువైన మద్యం బాటిళ్లలో మిక్సింగ్‌ మద్యం ఉన్నట్లు గుర్తించి నిందితులను విచారించారు. తొలుతగా పట్టుబడిన ప్రకాష్‌ గౌడ్‌, గద్వాల భరత్‌ అనే ఇద్దరిని అరెస్టు చేసి వారిని విచారించారు. ఈ మద్యం బాటిళ్లను ప్రకాష్‌ గౌడ్‌ తమ్ముడు అరవింద్‌ ఇంట్లోంచి తీసుక వస్తున్నామని తెలిపారు.

Advertisement

నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు.. కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డులో నివాసముంటున్న అరవింద్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతని ఇంట్లో 46 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అరవింద్‌ను విచారించగా ఒరిస్సాకు చెందిన.. బుచ్చిదేవ్‌ మహంతి అనే వ్యక్తి వద్ద మిక్సింగ్‌ బాటిళ్లను తయారు చేస్తామని తెలిపారు. మహంతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా, 54 మద్యం బాటిళ్లు లభించాయి. మహంతితోపాటు విక్రమ్‌ అనే వ్యక్తి సోదాలు నిర్వహించ గా 24 మద్యం బాటిళ్లు లభించాయి.

ఇలా తీగలాగితే డొక్కంత కదిలినట్లుగా ఖరీదైన మద్యం బాటిళ్లలో.. తక్కువ ధరలు కలిగిన రాయల్‌ స్టాగ్‌, ఇతర తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని మిక్సింగ్‌ చేసి రూ. 20 వేల బాటిల్‌ను రూ. పది వేలకు, అమ్మకాలు జరుపుతూ, సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. ఈ ముఠాలోని ఐదుగురు బార్లలోను, వివిధ ఫంక్షన్లలో మద్యం సరఫరా చేస్తారని ఎక్సైజ్‌ పోలీసులు వెల్లడించారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్‌లా సాగుతుంది: ఎంపీ రఘునందన్

మద్యం బాటిళ్ల, తయారు చేసే సామాగ్రి కలిపి రూ. 8 లక్షల మేరకు ఉంటుందని అంచనా వేశారు. ఎవరైనా తక్కువ ధరలకు మద్యాన్ని విక్రస్తామంటే నమ్మవద్దని, శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కృష్ణ ప్రియ తెలిపారు. నిందితులను మద్యం బాటిళ్లను షేర్‌లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించిన్నట్లు సమాచారం.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×