E-Paper
Advertisement

Mushroom Benefits: మష్రూమ్స్ తింటే బోలెడు లాభాలు, పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

Mushroom Benefits: మష్రూమ్స్ తింటే బోలెడు లాభాలు, పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
Advertisement

Mushroom Benefits: మష్రూమ్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉండే పుట్టగొడుగులు గుండె జబ్బులు, క్యాన్సర్ , మతిమరుపు వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి రోజూ మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి పోషక విలువలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

Advertisement

పుట్టగొడుగులలో రెండు ప్రధాన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవే ఎర్గోథియోనిన్, గ్లూటాథియోన్. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరానికి హాని కలిగిస్తాయి. అంతే కాకుండా వివిధ వ్యాధులకు దారితీస్తాయి. ప్రధానంగా ఎనిమిది రకాల పుట్టగొడుగులకు మనకు లభిస్తున్నాయి.

బటన్ పుట్టగొడుగులు:
ఈ పుట్టగొడుగులు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఎక్కువ మంది తినేవాటిలో ఇవి ముందు వరుసలో ఉంటాయి. వీటిలో విటమిన్లు బి, డి, సెలీనియం, రాగి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

Advertisement

ఆయిస్టర్ పుట్టగొడుగులు:
ఈ పుట్టగొడుగులు మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. విటమిన్లు సి, బి12, ఫోలిక్ ఆమ్లం వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి.

షిటాకే పుట్టగొడుగులు:

ఈ పుట్టగొడుగులను ప్రత్యేకంగా రోగనిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి తినాలి. బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారు పుట్ట గొడుగులను ఎక్కువగా తినాలి.

రీషి , టర్కీ టెయిల్ పుట్టగొడుగులు:

ఈ పుట్టగొడుగులను ఆయుర్వేద , ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.

పుట్టగొడుగుల ప్రయోజనాలు:

– మధుమేహం, గుండె రోగులకు ఒక వరం.
–  పుట్టగొడుగులు ప్రోటీన్, ఫైబర్ , పొటాషియం, సోడియం వంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి అనువైన ఆహారం. వీటిని ప్రతి రోజు మీరు తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
– వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయి. త్వరగా బరువు తగ్గాలని అనుకునే వారు పుట్ట గొడుగులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
– పుట్టగొడుగులలోని ప్రోటీన్ ఉడికించిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది శాఖాహారులకు మంచి ఎంపికగా మారుతుంది.

విషపూరిత పుట్టగొడుగులు తినకుండా ఉండండి:
పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, అన్ని పుట్టగొడుగులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
– డెత్ క్యాప్ , డిస్ట్రాయింగ్ ఏంజిల్స్ వంటి కొన్ని జాతులు విషపూరితమైనవి.
– కొన్ని సైకెడెలిక్ పుట్టగొడుగులు తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయి.

Also Read: షుగర్ ఉన్న వారికి ఈ పండ్లు వరం, ఎక్కడ దొరికినా వదలొద్దు !

ప్రతిరోజూ 5 పుట్టగొడుగులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఐదు చిన్న పుట్టగొడుగులను తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి
– గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
– క్యాన్సర్ , మతిమరపును నివారిస్తుంది.
– రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×