BigTV English

Bering Air plane Missing: అమెరికాలో మరో విమానం మిస్సింగ్.. రంగంలోకి దిగిన అధికారులు

Bering Air plane Missing: అమెరికాలో మరో విమానం మిస్సింగ్.. రంగంలోకి దిగిన అధికారులు

Bering Air plane Missing: అమెరికాలో పది మంది ప్రయాణికులతో కూడిన బేరింగ్ ఫ్లైట్ విమానం మిస్సింగ్ అయింది. ఈ నేపథ్యంలో విమానం మిస్ అవడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని గాల్లోకి వెళ్లిన తర్వాత ఫ్లైట్ మిస్సయింది. పది మంది ప్రయాణికులతో ఉనలక్లీట్ నుంచి బయల్దేరిన బేరింగ్ ఎయిర్ ఫ్లయిట్.. అలస్కాలోని నోమ్‌కు వెళుతుండగా అదృశ్యం అయింది.


మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది. సాయంత్రం 4.20 నోమ్‌లో ల్యాండింగ్‌కు షెడ్యూల్ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో 3.20 నిమిషాల నుంచి విమానం కనెక్షన్ కట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అది మరువక ముందే వరుస విమాన ప్రమాదాలపై ప్రజలందరు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పొగ మంచు కారణంగానే సిగ్నల్స్ కట్ అయ్యిందా? లేక విమానం ఎక్కడైనా క్రాష్ అయిందా అనే కోణంలో రెస్క్యూ టీమ్ దర్యాప్తు కొనసాగుతోంది.

అమెరికాలోని అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఓ విమానం జాడ గల్లంతయ్యింది. ఇందులో దాదాపు పది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అలస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇది బేరి ఎయిర్ సంస్థకు చెందిన Cessna 208B Grand Caravan మోడల్‌గా గుర్తించారు. సహాయక బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. అయితే గత వారం రోజుల నుంచి పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా షాపింగ్‌మాల్ విమాన ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇల్లు, కార్లు అన్ని ధ్వంసం అయ్యాయి. ఈ విమానం మెడికల్ ట్రాన్స్ పోటర్‌గా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో నలుగురు సిబ్బందితోపాటు.. ఓ చిన్నారి ఆమె తల్లికూడా ఉన్నారు. వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయారు.


అంతకముందే.. వాషింగ్టన్ రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్ట్.. ఇటు వైపు ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాఫ్టర్, అటు అమెరియన్ ఎయిర్ లైన్స్- 5342 విమానం. ఈ ఫ్లైట్ ల్యాండింగ్ చేస్తుండగా.. యుఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాక్‌ నదిలో కూలిపోయాయి. జెట్‌లో అరవై మంది ప్రయాణికులతో పాటు.. నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 64 మంది వరకూ చనిపోయారని అధికారిక ప్రకటన చేశారు అధికారులు. అనుకోని విధంగా జరిగిన ఈ ఘోర గగన తల ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ విధ్వంసకర ప్రమాదం US ఫిగర్ స్కేటింగ్ కమ్యూనిటీని అదిరిపడేలా చేసింది. కాన్సాస్‌లో జరిగిన యుఎస్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగి వస్తున్న స్కేటర్లు ఈ విమానంలో ఉన్నారు.

Also Read: ట్రంప్ స్పీడుకి బ్రేక్.. ఉద్యోగుల రాజీనామా ఆదేశాలపై స్టే విధించిన కోర్టు

ఇద్దరు ప్రపంచ ఛాంపియన్లతో సహా పలువురు ఫిగర్ స్కేటర్లు మరియు కోచ్‌లు విమానంలో ఉన్నారు. వీరిలో వాడిమ్ నౌమోవ్, షిష్కోవా జంట.. 1994-స్కేటింగ్‌లో ప్రపంచ చాంపియన్లు. ప్రస్తుతం కోచ్‌లుగా ఉన్నారు ఈ భార్యాభర్తలిద్దరు. వీరితో పాటు.. వీరి కుమారుడు మాగ్జిమ్.. ఇటీవలే పురుషుల ఫ్రీ- స్కేట్ ఛాంపియన్‌షిప్‌లో ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు. ఇతడు కూడా విమానంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాద ఘటనకు కారణం.. సాంకేతిక లోపమా? లేక మానవ తప్పిదమా? అన్న కోణంలో దర్యాప్తు చేశారు FAA, NTSB అధికారులు. ప్రాధమిక సమాచారం ప్రకారం.. మానవ తప్పిదమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు అధికారులు. హెలికాప్టర్‌కు, విమానానికి మధ్య సమన్వయం లోపించడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×