BigTV English
Advertisement

Fruits For Diabetics: షుగర్ ఉన్న వారికి ఈ పండ్లు వరం, ఎక్కడ దొరికినా వదలొద్దు !

Fruits For Diabetics: షుగర్ ఉన్న వారికి ఈ పండ్లు వరం, ఎక్కడ దొరికినా వదలొద్దు !

Fruits For Diabetics: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్క సారి డయాబెటిస్ వచ్చిన తర్వాత దానిని నియంత్రించడం చాలా కష్టం. రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంచుకోకపోతే అది గుండెతో పాటు మూత్రపిండాలు, ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. రోజు వారి జీవన విధానంలో మార్పులతో పాటు ఆహారంపై కూడా శ్రద్ధ వహిస్తే డయాబెటిస్‌ను కొంతవరకు అధుపులో ఉంచుకోవచ్చు . మరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఎలాంటి పండ్లు ఉపయోగపడతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


యాపిల్ :
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే పోషకాలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. యాపిల్‌లో ఫైబర్‌తో పాటు పెక్టిన్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్సెలిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అల్ఫాహారంగా కూడా యాపిల్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బెర్రీస్ :
బెర్రీస్‌లో డయాబెటిస్ తగ్గించే గుణాలు ఉంటాయి. బెర్రీస్‌లో ఫైబర్ , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర స్థాయిలు సమతుల్యం చేయబడతాయి. వీటిని తరచుగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.


నేరేడు పండ్లు:
నేరేడు పండ్లు డయాబెటిస్ రోగులకు వరం అని చెప్పాలి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా కాపాడుతుంది. అంతే కాకుండా నేరేడు గింజలు కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. నేరేడు పండ్లను నేరుగా కూడా తినవచ్చు. అంతే కాకుండా విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి నీటితో కూడా తీసుకోవచ్చు.

బొప్పాయి:
బొప్పాయిలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. అదనంగా జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. బొప్పాయిని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. లేదా స్మూతీగా కూడా తయారు చేసి త్రాగవచ్చు. షుగర్ ఉన్న వారు బొప్పాయిని తరుచుగా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

Also Read: అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

వ్యాయామాలతో.. డయాబెటిస్‌కు చెక్ :

నడక:
డయాబెటిస్ రోగులకు నడక కూడా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. అంతే కాకుండా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి వాకింగ్ చాలా ప్రయోజనకరం.

జాగింగ్ :
కండరాలను బలంగా చేయడంలో కూడా జాగింగ్ చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా డయాబెటిస్ రోగులకు ఇది మంచి వరం. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా జాగింగ్ ఉపయోగపడుతుంది.

Related News

ABC Juice: రోజూ ఏబీసీ జ్యూస్ తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !

Dates Benefits: ఖర్జూరాన్ని ఇలా తీసుకున్నారంటే.. వందల రోగాలు మటుమాయం!

Tea for Kids: పిల్లలకు టీ ఇవ్వడం ప్రమాదకరమా? ఏ వయసు నుంచి టీ ఇవ్వాలి?

Lifestyle Tips: రోజును ఉల్లాసంగా ప్రారంభించడానికి 7 మార్గాలు..

Fat Rich Fruits : ఫ్యాట్ ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Big Stories

×