E-Paper
Advertisement

Kissing: ముద్దు పెట్టుకుంటున్నారా? ఆగండి.. ఆగండి.. ముందు ఇది చదవండి, లేకపోతే..

Kissing: ముద్దు పెట్టుకుంటున్నారా? ఆగండి.. ఆగండి.. ముందు ఇది చదవండి, లేకపోతే..
Advertisement

ముద్దు.. పెద్దగా పరిచయం అసవరం లేదు. చాలా మంది తమ ప్రేమను ముద్దుల రూపంలో వ్యక్తం చేసుకుంటారు. రీసెంట్ గా చేసిన ఓ అధ్యయనంలో ముద్దుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 సెకెన్ల పాటు ముద్దు పెట్టుకుంటే, ఏకంగా 80 మిలియన్ల బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ ఫర్ అవుతుందని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో తమ జీవిత భాగస్వామితో రోజుకు కనీసం 9 సార్లు ముద్దులు పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. “లిప్ కిస్ అనేది ప్రేమ, సాన్నిహిత్యాన్ని బలంగా ప్రొజెక్ట్ చేస్తుంది. 10 సెకెన్లె ముద్దు కారణంగా ఇరువురి నోటి ద్వారా సుమారు 80 మిలియన్ల బ్యాక్టీరియాలు బదిలీ అవుతాయని గుర్తించాం. ఒక జంట ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటే, వారి మధ్య అంత గాఢత ఉన్నట్లు తేలింది” అని వివరించారు.

ముద్దులపై అధ్యయనం ఏం చెప్పిందంటే?

నెదర్లాండ్స్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్ (TNO) ముద్దుల గురించి రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా ఆమ్స్టర్డామ్‌ లోని మైక్రోపియాలో ఉన్న సూక్ష్మజీవుల మ్యూజియంలో పరిశోధకులు 21 జంటల మీద అధ్యయనం చేసింది. వారి సగటు ముద్దు ఫ్రీక్వెన్సీతో పాటు ముద్దు సమయం, వారు అనుభవించిన ఫీలింగ్ తో సహా రికార్డు చేశారు. లిప్ కిస్ తర్వాత లాలాజలంలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పరిమాణం మూడు రెట్లు పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. 10 సెకన్ల ముద్దు సమయంలో మొత్తం 80 మిలియన్ బ్యాక్టీరియా బదిలీ చేయబడిందని గుర్తించారు. ఒక్కో వ్యక్తి శరీరంలో 100 ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉన్నట్లు వెల్లడించారు. వాటి ద్వారా చాలా లాభాలు కలుగుతున్నట్లు గుర్తించారు.  ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలను గ్రహించడానికి, వ్యాధులను నివారించడాని సాయపడుతున్నట్లు తెలిపారు. అటు మనిషి నోటిలో 700 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నట్లు తేల్చారు. ఈ పరిశోధన ఓపెన్ యాక్సెస్ జర్నల్ మైక్రోబయోమ్‌ లో ప్రచురించారు.

ముద్దుతో కలిగే లాభాలు

Advertisement

ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడి తగ్గడం, ఆందోళన నుంచి ఉపశమనం లభించడం, బీపీ కంట్రోల్ కావడం, భాగస్వామితో అనుబంధం బలపడటం లాంటి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముద్దు అనేది ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపించి.. లైంగిక సామర్ధ్యాని పెంచుతున్నట్లు గుర్తించారు. ముద్దుతో కలిగే లాభాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ఒత్తిడి, ఆందోళన తగ్గింపు: ముద్దు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి, ప్రశాంతత లభిస్తుంది.

Advertisement

⦿ బీపీ కంట్రోల్: ముద్దు పెట్టుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

⦿ బలమైన అనుబంధం: ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలతో ప్రేమ, ఆప్యాయత భావన పెరుగుతుంది.  ఇది భాగస్వామితో అనుబంధాన్ని బలపరుస్తుంది.

⦿ సంతృప్తి పెరుగుతుంది: ముద్దు పెట్టుకోవడం వల్ల భాగస్వామి పట్ల సంతృప్తి మెరుగుపడుతుంది.

⦿ లైంగిక సామర్థ్యం పెరుగుదల: ముద్దు పెట్టుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.

Read Also:  ‘అక్కడ’ చింతపండు పెట్టి.. భార్యను చంపేసిన భర్త, ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×