E-Paper
Advertisement

Crime News: ‘అక్కడ’ చింతపండు పెట్టి.. భార్యను చంపేసిన భర్త, ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!

Crime News: ‘అక్కడ’ చింతపండు పెట్టి.. భార్యను చంపేసిన భర్త, ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!
Advertisement

అబ్బాయి బాగా చదువుకున్నాడు. ఓ సంస్థలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నాడు. అమ్మాయి కూడా బాగానే చదువుకుంది. ఇద్దరికీ పెళ్లయ్యింది.  కొద్ది కాలం వీరి సంసారం ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగింది. అదే సమయంలో భర్త ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పాడు. లైఫ్ లో ఇంకా సెటిల్ కాలేదని.. అయ్యే వరకు కాస్త ఆగుదామన్నాడు. అప్పటి వరకు సేఫ్టీ ఉపయోగించి శృంగారంలో పాల్గొందామని చెప్పాడు. అతడు చెప్పిన మాటలు ఆమె నమ్మింది. పిల్లలు కాకుండా అతడు చెప్పిన జాగ్రత్తలు పాటించింది. శృంగారానికి ముందు ఆమె జననేంద్రియంలో కాస్త చింత పండును పెట్టేవాడు. ఆమెకు ఏదో అనుమానం కలిగింది. ఎందుకు అలా పెడుతున్నారని అడిగింది.

చింతపండు పెడితే పిల్లలు కారంటూ..

భార్య ప్రశ్నకు భర్త ఓ ఆసక్తికర సమాధానం చెప్పాడు. అక్కడ చింతపండు పెట్టి శృంగారం చేస్తే పిల్లలు పుట్టరని భార్యకు చెప్పాడు. కొంత కాలం పాటు ఇలాగే చేద్దామని చెప్పాడు. అసలే తన భర్త సైంటిస్ట్ కావడంతో ఆమె సరే అని చెప్పింది. అతడు  ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నా, చింత పండు మర్చిపోకుండా పెట్టేవాడు. ఏడాది తర్వాత ఆమెకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. మరింత తీవ్రతరం అయ్యాయి. హాస్పిటల్లో చేర్పించారు. టెస్టులు చేసిన డాక్టర్లు ఆమెకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినట్లు చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే కొద్ది రోజుల్లోనే  చనిపోయింది. ఆమె పేరెంట్స్ తో పాటు అత్తమామలు కూడా సహజ మరణం అనుకున్నారు.

ఆమె మరణంపై డాక్టర్లకు అనుమానం

Advertisement

కుటుంబ సభ్యులకు ఆమె మరణం మీద ఎలాంటి డౌట్ లేకపోయినా, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లకు ఏదో తేడాగా అనిపించింది. కొద్ది నెలల కిందట చాలా ఆరోగ్యంగా ఉన్న ఆమె, ఇంత త్వరగా కిడ్నీలు చెడిపోయి చనిపోవడం ఏంటీ? అనే అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి, డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసేందుకు ఒప్పించారు. తల్లిదండ్రులు కూడా సరే అనడంతో పోస్టుమార్టం చేశారు. కిడ్నీ ఫెయిల్యూర్ తో చనిపోయినట్లు తేలింది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు ప్రశ్నార్థకం పెట్టి ఇచ్చారు. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు.

చింతపండులో ప్రమాదకర రసాయనం

ఆమె డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసిన ఎక్స్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకటరావు.. ఆ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కేసు విషయాన్ని ప్రస్తావించాడు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పీజీ చేసిన  సదరు వ్యక్తికి.. కొద్ది రోజుల తర్వాత భార్య మీద అనుమానం కలిగింది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు తనకు ఉన్న సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. పిల్లలు కావద్దనే నెపంతో చింతపండులో కిడ్నీలను డ్యామేజ్ చేసే ఓ రసాయాన్ని కలిపి శృంగారం సమయంలో అక్కడ పెట్టేవాడు. ఆ కెమికల్ కారణంగా తక్కువ సమయంలో ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి. చివరకు ప్రాణాలు కోల్పోయింది.

Advertisement

ఒకవేళ డాక్టర్లకు అనుమానం కలిగి ఉండకపోతే, ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేసేవారు. నిందితుడు నేరం నుంచి తప్పించుకునే వాడు. కానీ, పోస్టుమార్టం రిపోర్టు డెత్ మిస్టరీని బయటపెట్టింది. ఇప్పుడు ఆ క్రిమినల్ సైంటిస్ట్ జైల్లో చిప్పకూడుతింటున్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఘటన కొద్ఇ సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించింది. సహజ మరణంగా సీన్ క్రియేట్ చేయాలనుకున్నా, వైద్యులకు వచ్చిన అనుమానం నిందితుడిని కటకటాల వెనక్కు పంపేలా చేసింది. భార్య హత్యకు భర్త వేసిన కుట్రను బయటపెట్టింది.

Read Also: అడల్ట్ కంటెంట్లు.. పైరసీ సినిమాలు.. బెట్టింగ్ లింకులు.. అడ్డమైన పనులకు అడ్డ టెలిగ్రామ్, వాళ్లను అడ్డుకోలేరా?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×