E-Paper
Advertisement

Cockroach Coffee: బొద్దింకలతో రుచికరమైన కాఫీ, దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలిస్తే.. లొట్టలేస్తారేమో?

Cockroach Coffee: బొద్దింకలతో రుచికరమైన కాఫీ, దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలిస్తే.. లొట్టలేస్తారేమో?
Advertisement

Cockroach Coffee: బీజింగ్‌లోని ఒక మ్యూజియం కొత్త కాఫీ ఫ్లేవర్‌ను పరిచయం చేసింది. ఈ కాఫీలో వాడిన వింతైన పదార్థాల జాబితా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. బొద్దింకల పొడి, ఎండిన మీల్‌వార్మ్‌లను సుపరిచితమైన కాఫీలో కలుపుతున్నారు. దీని ధర చూస్తే షాక్ తింటారు. కప్పు కాఫీ ఏకంగా 45 యువాన్లు (సుమారు రూ. 570). ఈ కొత్త కాఫీ చైనాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాఫీ రుచికి కాలిన బీన్స్, కొద్దిగా పుల్లగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు.

కొత్త కాఫీ రుచి

రోచ్‌లతో కూడిన ఈ కాఫీని బీజింగ్‌లోని ఒక ఇన్సెక్ట్ మ్యూజియం లోపల ఉన్న కాఫీ షాప్‌లో అందిస్తారు. ఈ కాఫీ తయారీని గతేడాది జూన్ చివరిలో ప్రారంభించారు. ఇటీవల ఆన్‌లైన్‌లో ఈ కాఫీ వైరల్ కావడంతో జనం క్యూకడుతున్నారు. కీటకాల నేపథ్యం ఉన్న మ్యూజియంలోని కాఫీ షాపులో బొద్దింక పొడితో కాఫీ తయారీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ వెరైటీ కాఫీ ప్రధానంగా యువతను ఆకర్షిస్తుంది.

సాంప్రదాయ చైనీస్ వైద్యం నుండి ప్రేరణ

Advertisement

మ్యూజియం కేప్ లో రోజుకు 10 కప్పులకు పైగా రోచ్ కాఫీని విక్రయిస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. ఇందులో కీటకాల పొడితో సహా అన్ని పదార్థాలు సంప్రదాయ చైనీస్ ఔషధం దుకాణం నుండి సేకరించినట్లు తెలుస్తోంది. బొద్దింక పొడి రక్త ప్రసరణకు సహాయపడుతుందని చైనీస్ వైద్యం చెబుతోంది. అయితే ప్రోటీన్ అధికంగా ఉండే పసుపు మీల్‌వార్మ్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చైనీయులు నమ్ముతారు.

మెనూలో మరిన్ని కీటకాలు

బొద్దింక కాఫీ వైరల్ కావడంతో ప్రయోగాత్మకంగా మరిన్నీ కీటకాలతో మరిన్నీ కాఫీలు తయారు చేస్తున్నారు. మ్యూజియం పిచర్ ప్లాంట్ లో వివిధ జూస్ లను అందిస్తున్నారు. హాలోవీన్ సందర్భంగా పరిమిత-ఎడిషన్ యాంట్-ఇన్ఫ్యూజ్డ్ జూస్ విక్రయిస్తున్నారు. యాంట్ బ్రూ పుల్లని రుచిలో ఉందని, పిచర్ ప్లాంట్ వెర్షన్ సాధారణ కాఫీ లాగా రుచిగా ఉంటుందని కస్టమర్లు అంటున్నారు.

Advertisement

Also Read: Bunkers for safety: ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!

కొత్త కాఫీ ట్రెండ్

అసాధారణ కాఫీ క్రియేషన్‌లు చైనా అంతటా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో, యునాన్‌లోని ఒక కేఫ్ డీప్-ఫ్రైడ్ వార్మ్‌లతో కాఫీ తయారు చేసింది. అయితే జియాంగ్జీలోని ఒక కాఫీ షాప్ వేయించిన మిరపకాయలు, వేడి మిరియాల పొడిని కలిగి ఉన్న లాట్‌లతో కాఫీ తయారు చేసింది. తాజాగా బొద్దింక కాఫీ చైనా సంస్కృతిని, షాకింగ్ కాంబినేషన్ ను పరిచయం చేస్తుంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×