E-Paper
Advertisement

Sweets: స్వీట్లు తెగ తింటున్నారా ? మీ శరీరానికి జరిగే నష్టం ఇదే !

Sweets: స్వీట్లు తెగ తింటున్నారా ? మీ శరీరానికి జరిగే నష్టం ఇదే !
Advertisement

Sweets: భారతదేశంలో ఏ వేడుకనైనా స్వీట్లు లేకుండా అసంపూర్ణంగానే పరిగణిస్తారు. అది పండగ అయినా.. పెళ్లి అయినా, లేదా చిన్న సక్సెస్ అయినా, స్వీట్లు మన సంస్కృతిలో అంతర్భాగం. కానీ ఈ తీపి శరీరం సరిగ్గా గ్రహించకపోతే అది అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని మీకు తెలుసా? అవును స్వీట్స్ ఎక్కువగా తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయిని నిపుణులు చెబుతున్నారు. స్వీట్లు అదుపు లేకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్,పీసీఓడీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. దీని అర్థం మీరు స్వీట్లను పూర్తిగా వదులుకోవాలని కాదు బదులుగా, వాటిని తెలివిగా తినాలి.

స్వీట్లు తినేటప్పుడు కొన్ని చిన్న, ముఖ్యమైన విషయాలను మనం దృష్టిలో ఉంచుకుంటే..మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా జీవితంలోని మధురమైన క్షణాలను ఆస్వాదించవచ్చు. సరైన సమతుల్యత, సరైన ఎంపిక మాత్రమే వ్యాధుల ఉచ్చు నుంచి మనల్ని కాపాడుతుంది.

Advertisement

స్వీట్లు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి:

పండ్లు:
పండ్లు తినడం పూర్తిగా సురక్షితమని చాలా మంది అనుకుంటారు. కానీ పండ్లలోని సహజ చక్కెర (ఫ్రక్టోజ్) కూడా రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. వేటితోనూ కలపకుండా పండ్లను మాత్రమే తినకూడని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎల్లప్పుడూ జీడిపప్పు.. బాదం లేదా వాల్‌ నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి పండ్లను తినండి. ఈ కలయిక చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా స్థిరమైన శక్తిని అందిస్తుంది.

Advertisement

డార్క్ చాక్లెట్:
ఏ వేడుకైనా.. సాధారణ మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోండి. ఇందులో చక్కెర, పాలు ఎక్కువగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో గుండెకు మంచి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత మీరు ఒకటి లేదా రెండు ముక్కలు డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు. ఇది మీ తీపి కోరికలను తీరుస్తుంది. అంతే కాకుండా మీ శరీరానికి హాని కలిగించదు.

చియా సీడ్స్ :
ఐస్ క్రీమ్ లేదా కేక్ వంటి కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాలకు బదులుగా.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న స్వీట్లు తినండి. ఇంట్లో తయారుచేసిన శనగపిండి లడ్డులు, చియా పుడ్డింగ్, మఖానా లడ్డులు లేదా డ్రై ఫ్రూట్ లడ్డులు తినడం మంచిది. ఈ స్వీట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా శరీరంలో చక్కెర స్థాయిలలో అకస్మాత్తుగా పెరుగుదలకు కారణం అవుతాయి.

Also Read: సిగరెట్ మాసేసిన 30 రోజులు.. మీ ఊపిరితిత్తులు మళ్లీ ఎలా జీవం పోసుకుంటాయంటే ?

శుద్ధి చేసిన చక్కెరలు ‘వద్దు:
తెల్ల చక్కెర లేదా శుద్ధి చేసిన చక్కెర ఆరోగ్యానికి ముప్పు. బదులుగా బెల్లం, తేనె, ఖర్జూరం లేదా మొలాసిస్ వంటి సహజ తీపి పదార్థాలను ప్రయత్నించండి. ఈ ప్రత్యామ్నాయాలు తీపిని అందించడమే కాకుండా ఐరన్, ఇతర ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. అయితే సహజంగా ఉన్నప్పటికీ బరువు నియంత్రణలో ఉంచడానికి వాటిని మితంగా తీసుకోవాలి.

తులసి కషాయం :
పార్టీలలో అందించే కూల్ డ్రింక్స్ అధిక టీ, కాఫీ శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలవు. బదులుగా.. అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క లేదా తాజా పండ్ల రసంతో తయారు చేసిన కషాయాన్ని తాగండి. ఈ మూలికా డ్రింక్స్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా.. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తాయి.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×