E-Paper
Advertisement

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!
Advertisement

Machilipatnam: మచిలీపట్నంలో గత రాత్రి వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో సామాన్యులపై దాడికి తెగబడిన నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రౌడీ మూకలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

గత రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, సమీపంలోని సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్ పేట సీఐ యేసుబాబు.. దాడికి పాల్పడిన బలరామునిపేటకు చెందిన ముగ్గురు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

నిందితులకు గుణపాఠం చెప్పేలా సీఐ యేసుబాబు వారిని సిటీ కేబుల్ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించి స్థానికుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు.

ALSO READ: Vicarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం

Advertisement

Related News

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×