E-Paper
Advertisement

Combination Food: ఎగ్స్‌తో పాటు.. వీటిని పొరపాటున కూడా తినొద్దు !

Combination Food: ఎగ్స్‌తో పాటు..  వీటిని పొరపాటున కూడా తినొద్దు !
Advertisement

Combination Food: ఎగ్స్ అత్యంత పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో అధిక నాణ్యత గల ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ గుడ్లను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా పోషకాలు శరీరానికి సరిగా అందకపోవచ్చు. మీ ఆరోగ్యం, జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే.. ఎగ్స్‌తో కలిపి ఎలాంటి ఆహారన పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. చక్కెర:

ఎగ్స్‌తో పాటు చక్కెరను కలిపి వండటం లేదా తినడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా.. అధిక ఉష్ణోగ్రత వద్ద గుడ్లను చక్కెరతో కలిపి ఉడికించినప్పుడు.. ఈ రెండింటిలో ఉండే అమైనో ఆమ్లాలు, చక్కెర ఒక సంక్లిష్ట రసాయన ప్రతిచర్యకు లోనవుతాయి. దీని వల్ల ‘గ్లైకోటాక్సిన్స్’ అనే విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. ఈ గ్లైకోటాక్సిన్స్ రక్తంలో కలిసి, గుండె సంబంధిత సమస్యలకు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

Advertisement

2. ప్రాసెస్ చేసిన మాంసం:

ప్రాసెస్ చేసిన మాంసంలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. గుడ్లతో పాటు వీటిని అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు, ఈ నైట్రేట్లు గుడ్లలోని అమైనో ఆమ్లాలతో చర్య జరిపి.. క్యాన్సర్‌కు కారణమయ్యే ‘నైట్రోసమైన్‌లు’ అనే సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లను తింటే.. ప్రాసెస్ చేసిన మాంసాలకు బదులుగా తాజా కూరగాయలు లేదా లీన్ ప్రొటీన్‌ను కలపడం మంచిది.

3. సోయా పాలు:

సోయా పాలు , గుడ్లను ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు. సోయా పాలలో ‘ట్రైప్సిన్ ఇన్హిబిటర్’ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఈ ఇన్హిబిటర్, గుడ్లలోని ప్రొటీన్‌ను జీర్ణం చేయడానికి సహాయపడే ముఖ్యమైన ఎంజైమ్ అయిన ‘ట్రైప్సిన్’ చర్యను నిరోధిస్తుంది. దీని వల్ల గుడ్లలోని ప్రొటీన్ సరిగా జీర్ణం కాక, శరీరానికి పోషకాలు అందవు. జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

4. కొన్ని రకాల మందులు :

గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ లేదా థైరాయిడ్ మందులు తీసుకునేటప్పుడు.. గుడ్లు వాటి శోషణ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు.. థైరాయిడ్ మందులు వేసుకునేవారు గుడ్లను వాటితో పాటు లేదా వెంటనే తినకూడదు. మందులు వేసుకున్న తర్వాత కనీసం 30 నిమిషాల సమయం ఇవ్వడం మంచిది. మీ మందులకు, ఆహారానికి మధ్య సరైన వ్యవధి గురించి డాక్టర్‌ని సంప్రదించాలి.

5. పప్పుధాన్యాలు:

పప్పుధాన్యాలు, గుడ్లు రెండూ ప్రొటీన్లకు మూలం. వీటిని కలిపి తినడం వల్ల ఒకేసారి అధిక మొత్తంలో ప్రొటీన్‌ను తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా.. జీర్ణ శక్తి తక్కువగా ఉన్నవారికి లేదా వృద్ధులకు ఇది జీర్ణవ్యవస్థపై భారం పెంచి, అజీర్ణం, కడుపు నొప్పి లేదా ఉబ్బరానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

Also Read: ఈ అలవాటు మీ జుట్టును రహస్యంగా దెబ్బతీస్తుంది? వెంటనే మార్చుకోండి

6. ఎక్కువ నూనెలో  వేయించిన గుడ్లు:

గుడ్లు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ.. వాటిని ఎక్కువగా నూనె లేదా నెయ్యిలో డీప్ ఫ్రై చేయడం మంచిది కాదు. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన నూనెల్లోని కొవ్వులు గుడ్లలోని పోషకాలతో కలిసి.. అదనపు అనారోగ్యకరమైన కొవ్వులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. గుడ్లను ఉడికించడం, తక్కువ నూనెతో ఆమ్లెట్ లేదా స్క్రంబుల్ చేయడం ఉత్తమ మార్గాలు.

7. పాల ఉత్పత్తులు:

గుడ్లను వెన్న లేదా అధిక కొవ్వు గల జున్నుతో అధికంగా కలిపి తినడం వల్ల కొవ్వ, కేలరీల వినియోగం పెరుగుతుంది. ఈ కలయిక జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. కొద్ది మొత్తంలో తీసుకోవడం ఫర్వాలేదు. కానీ బరువు తగ్గాలనుకునేవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకుంటేనే మంచిది. 

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×