E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో రొమాంటిక్ ట్రిప్ కావాలా.. ఇండియాలో టాప్ హనీమూన్ స్పాట్స్ ఇవే

తక్కువ బడ్జెట్‌లో రొమాంటిక్ ట్రిప్ కావాలా.. ఇండియాలో టాప్ హనీమూన్ స్పాట్స్ ఇవే
Advertisement

పెళ్లి తర్వాత నవదంపతులు కలిసి ప్రత్యేకంగా సమయాన్ని గడపాలని కోరుకుంటారు. హనీమూన్ అనేది కొత్త జీవితానికి అందమైన ఆరంభం లాంటిది. అయితే అప్పటికే పెళ్లి ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా మంది హనీమూన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయలేరు. అలాంటి జంటల కోసం భారతదేశంలోనే తక్కువ బడ్జెట్‌లో హనీమూన్ స్పెషల్ లొకేషన్స్ ఉన్నాయి. కొండలు, బీచ్‌లు, దీవులు, ఎడారులు ఇలా ప్రతి రకమైన ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి.

మనాలి, నైనిటాల్, ముస్సోరీ ప్రేమ జంటలకు స్పెషల్ హిల్ స్టేషన్స్

మనాలి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హనీమూన్ హిల్ స్టేషన్స్‌లో ఒకటి. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, చల్లటి వాతావరణం జంటలను ఆకర్షిస్తాయి.
నైనితాల్ కూడా తక్కువ ఖర్చుతో మంచి హనీమూన్ డెస్టినేషన్. ఇక్కడ అందమైన సరస్సులు, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంత ప్రత్యేకత. ఇక్కడ కొత్తజంటలు బోటు ప్రయాణాలు చేసి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
ముస్సోరీని ‘క్వీన్ ఆఫ్ హిల్స్’ అని పిలుస్తారు. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం హనీమూన్‌కు మరింత ప్రత్యేకతను ఇస్తాయి. ఈ ప్రాంతాల్లో హోటల్స్, ఆహారం కూడా బడ్జెట్‌కు అనుగుణంగా లభిస్తాయి.

గుల్మార్గ్, లక్షద్వీప్ స్పెషల్ హనీమూన్ స్పాట్స్

Advertisement

జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్ తన అద్భుతమైన పర్వత దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని మైదానాలు, రంగురంగుల పూల తోటలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ గోండోలా రైడ్, ట్రెక్కింగ్, హైకింగ్, స్కీయింగ్ వంటి అనేక కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

మరోవైపు లక్షద్వీప్ ప్రశాంతమైన బీచ్‌లు, పారదర్శకమైన సముద్ర జలాలతో జంటలకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, బీచ్‌ల వద్ద విశ్రాంతి తీసుకోవడం ఇక్కడి అతిపెద్ద హైలైట్స్.

ప్రకృతి, సంస్కృతి అందమైన కలయిక గ్యాంగ్‌టక్, రన్ ఆఫ్ కచ్

Advertisement

సిక్కింలోని గ్యాంగ్‌టక్ అందమైన హిమాలయ పర్వత దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. త్సోంగో సరస్సు, తాషి వ్యూ పాయింట్ వంటి ప్రదేశాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి స్థానిక మార్కెట్లు షాపింగ్ ప్రేమికులకు మంచి అవకాశాలను అందిస్తాయి.
గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్ పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. తెల్లని ఉప్పు ఎడారి ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది. రన్ ఉత్సవ్ సమయంలో జానపద సంగీతం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

ఊటీ, మౌంట్ అబూ తక్కువ బడ్జెట్‌ ఆప్షన్స్

ఊటీ పచ్చని టీ తోటలు, చల్లటి వాతావరణం, ప్రశాంతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. హనీమూన్ జంటలు ఇక్కడ సంతోషకరమైన సమయాన్ని గడపవచ్చు.
రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన ‘మౌంట్ అబూ’ కూడా మంచి బడ్జెట్ హనీమూన్ డెస్టినేషన్. అందమైన సరస్సులు, వ్యూ పాయింట్స్, ఆహ్లాదకరమైన వాతావరణం జంటలను ఆకర్షిస్తాయి.

Also Read: అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టం.. నిజమేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే

తక్కువ ఖర్చుతో కూడా మధుర జ్ఞాపకాలు సృష్టించుకోవచ్చు

హనీమూన్ కోసం భారీ బడ్జెట్ అవసరం లేదు. సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతోనే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు. భారతదేశంలోని ఈ అందమైన ప్రదేశాలు ప్రేమ, ప్రకృతి, ప్రశాంతతను ఒకేసారి అందిస్తాయి. సరైన బడ్జెట్ ప్లానింగ్‌తో మీ హనీమూన్‌ మరింత స్పెషల్‌గా గడపండి.

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×