E-Paper
Advertisement

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. పక్కా స్కెచ్‌తో.. నైజీరియన్ మహిళా పెడ్లర్​ అరెస్టు

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. పక్కా స్కెచ్‌తో.. నైజీరియన్ మహిళా పెడ్లర్​ అరెస్టు
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లో గట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ మహిళను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 7.5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన జేమ్స్ టెస్లింగ్ ఇమ్మాన్యుయెల్..​ కొంతకాలం క్రితం భారత్ కు వచ్చింది. తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను తన దేశానికే చెందిన పెడ్లర్లతో సంబంధాలు ఏర్పరుచుకుంది.

ముంబయిలో ఉంటున్న ఓ పెడ్లర్ నుంచి తరచూ కొకైన్​ ను గ్రాము రూ.15 వేలకు కొని హైదరాబాద్ తీసుకొచ్చి గ్రాము రూ.30 వేలకు అమ్ముతోంది. జేమ్స్ టెస్లింగ్​ చేస్తున్న ఈ దందా గురించి సికింద్రాబాద్ డీటీఎఫ్​ ఇన్స్​ పెక్టర్​ సౌజన్య పక్కాగా సమాచారాన్ని సేకరించారు. ఎస్​ఐ శివకృష్ణ, సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు.

Advertisement

Also Read: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణ తరహా సంక్షేమం.. భట్టి విక్రమార్క హామీ

జేమ్స్ టెస్లింగ్ శుక్రవారం ముంబయి నుంచి కొకైన్ కొని సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని సన్ షైన్ హాస్పిటల్ వద్దకు డెలివరీ ఇవ్వటానికి వస్తున్నట్టు తెలుసుకుని సిబ్బందితో కలిసి మాటు వేశారు. సేకరించిన సమాచారం మేరకు జేమ్స్ టెస్లింగ్​ ఆటోలో అక్కడికి చేరుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. ఆమె నుంచి రూ.2.35 లక్షల రూపాయల విలువ చేసే 7.5 గ్రాముల కొకైన్​ ను సీజ్ చేశారు. నిందితురాలిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్​ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Also Read: ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్‌లో.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కొంపకొల్లేరే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×