E-Paper
Advertisement

Water Disruption: విద్యుత్ కోతల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు.. ఆ ఏరియాలకు అలర్ట్!

Water Disruption: విద్యుత్ కోతల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు.. ఆ ఏరియాలకు అలర్ట్!
Advertisement

Water Disruption: హైదరాబాద్ వాతావరణంల చోటుచేసుకుంటున్న అకస్మిక మార్పుల కారణంగా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్నట్లు జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది. మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూర్, మంజీర పంప్ హౌజ్ ఉన్న ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. గాలి దుమారం, వడగండ్ల వానలు, అకాల వర్షాలు తరచూ సంభవించడం వల్ల చెట్లు విరిగి పడటం, విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. ఈ పరిణామాల వల్ల విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడి.. నీటి పంపింగ్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు పేర్కొంది.

నీటి పంపింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న అంతరాయం వల్ల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఆలస్యమవుతున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లే బోర్డ్ (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిస్థితులు పాత మంజీరా నీటి సరఫరా వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, 15 నుండి 30 నిమిషాలపాటు మాత్రమే కొనసాగే స్వల్పకాలిక విద్యుత్ అంతరాయాలు కూడా మంజీరా వ్యవస్థకు చెందిన పంపింగ్ స్టేషన్ల కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement

ఆదివారం (ఏప్రిల్ 19) రోజున జరిగిన విద్యుత్ అంతరాయం కారణంగా సుమారు 7 గంటలపాటు పంపింగ్ నిలిచిపోవడంతో షెడ్యూల్ ప్రకారం జరిగే పనులు కొంత మేరకు స్తంభించాయని అశోక్ రెడ్డి తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాలు పంపింగ్ ప్రక్రియను నిలిపివేయడమే గాక.. పనితీరు లోపాలు, నీటి ప్రెషర్ లో మార్పులు, నీటి సరఫరా సక్రమంగా అందించలేక ఆలస్యానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ఎఫెక్టు పడే అవకాశాలున్నట్లు స్పష్టం చేశారు.

ముఖ్యంగా నగరంలోని ఆర్సీ పురం, బీహెచ్‌ఈఎల్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, SR నగర్, సనత్‌నగర్ పరిసర ప్రాంతాలలో నీటి సరఫరా షెడ్యూల్ లో అంతరాయం ఏర్పడవచ్చని జలమండలి పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రాంతాలు తాత్కాలిక నీటి కొరత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. మరోవైపు అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరాను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ బోర్డు స్పష్టం చేసింది. అదే సమయంలో, ఇతర ప్రాంతాల్లో సాధారణ నీటి సరఫరా కొనసాగేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Advertisement

Also Read: ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా? కొంపలు అంటుకుపోతాయ్.. ఈ విషయాలు తెలుసుకోండి!

మరోవైపు తాగునీటి సమస్యలపై జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుంటూ వెంటనే మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ వాటర్ బోర్డ్ స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన వెంటనే పంపింగ్‌ను ప్రారంభించి.. నీటి సరఫరా యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అవసరమైన చోట్ల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు, అహార్నిశలు కృషి చేస్తున్నారని జలమండలి పేర్కొంది. ప్రజలు దీనిని అర్థం చేసుకుని సహకరించాలని జలమండలి కోరింది.

Also Read: Rajinikanth: రెమ్యూనరేషన్ విషయంలో రజనీకాంత్ కొత్త పంథా.. అందరికీ ఆదర్శం!

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×