E-Paper
Advertisement

నాలుగేళ్ల వివాదానికి తెరదించిన సాయి పల్లవి!

నాలుగేళ్ల వివాదానికి తెరదించిన సాయి పల్లవి!

Sai Pallavi: చిత్ర పరిశ్రమలో లేడీ పవర్ స్టార్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి పల్లవి (Sai Pallavi) అందం, అభినయంతో పాటు టాలెంట్ కూడా కలగలిసిన కథానాయిక. తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’ అనే చిత్రంలో సీతగా కూడా నటిస్తోంది. ఇకపోతే సాయి పల్లవి కెరియర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా సరే కొన్ని వివాదాలు మాత్రం ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తాను మలయాళీని కాదు అన్న విషయంపై గతంలో జరిగిన రచ్చపై ఇప్పుడు సాయి పల్లవి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఎట్టకేలకు నాలుగేళ్ల క్రితం జరిగిన వివాదాన్ని ఇన్నాళ్లకు ఓపెన్ అవడంతో అభిమానులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి అసలేం జరిగింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

వివాదాలకు చెక్ పెట్టిన సాయి పల్లవి..

అసలు విషయంలోకి వెళ్తే.. సుమారుగా 4 సంవత్సరాలు క్రితం సాయి పల్లవి ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో “మీరు మలయాళీలు అయ్యుండి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? ” అని రిపోర్టర్ ప్రశ్నించగా.. అప్పుడు సాయి పల్లవి “నేను తమిళ అమ్మాయిని మలయాళీని కాదు” అని బదులిచ్చింది. కానీ రెండు సంవత్సరాల తర్వాత అదే మాటను కొందరు వక్రీకరించి “మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది” అంటూ తప్పుడు ప్రచారం చేశారట. ఇక ఈ హెడ్లైన్ చూసి..” తాను షాక్ కి గురయ్యాను. అసలు నేను అనని మాటలను నాపై మోపడం చాలా బాధాకరం.. తమిళనాడులోని కోయంబత్తూర్ లో నేను పుట్టి పెరిగాను. నా మాతృభాష తమిళం అని మాత్రమే నేను చెప్పాను. అంతే తప్ప ఇతర భాషలను నేను తక్కువ చేసి మాట్లాడలేదు” అంటూ తనపై వచ్చిన తప్పుడు ప్రచారానికి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ఇకపోతే ఈ వివరణ ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు సమయం ఎందుకు అంటూ అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వివరణతో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ చిన్నపాటి వివాదానికి ఇప్పుడు పూర్తిస్థాయిలో తెరపడింది అని చెప్పవచ్చు.

ALSO READ:ప్రకాష్ రాజ్ పై నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు.. వివరణ ఇచ్చినా ఆగని వైనం!

సాయి పల్లవి సినిమా కెరియర్..

సాయి పల్లవి కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ఏక్ దిన్ ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత నితీష్ తివారి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం రామాయణం మొదటి , రెండు భాగాలలో నటిస్తోంది. మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుండగా .. రెండవ భాగం వచ్చే ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది. అలాగే ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఒక తమిళ ప్రాజెక్టులో సాయి పల్లవి భాగమయ్యింది. అంతేకాదు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఒక ప్రతిష్టాత్మక తమిళ్ చిత్రంలో కూడా సాయి పల్లవినీ హీరోయిన్గా ఎంచుకున్నట్లు సమాచారం.

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×