E-Paper
Advertisement

ఏప్రిల్ 1.. అందరినీ ‘ఫూల్స్’ చేసే రోజు అసలు ఎక్కడ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న షాకింగ్ హిస్టరీ ఇదే!

ఏప్రిల్ 1.. అందరినీ ‘ఫూల్స్’ చేసే రోజు అసలు ఎక్కడ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న షాకింగ్ హిస్టరీ ఇదే!
Advertisement

April Fools: ‘ఏప్రిల్ ఫూల్’..ఏప్రిల్ 1st వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా అందరు ఒకరికొకరు సరదాగా ఆటపట్టించుకోవడం మనం చూస్తునే ఉంటాం. మరి వరల్డ్ వైడ్ గా ఇంత పాపులర్ అయిన ఈ ఏప్రిల్ 1st వెనకాల అసలు సంగతులేంటో, అసలు ఎలా వాడుకలోకి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

పాత పద్ధతిని ఫాలో అయ్యే వారిని చూసి ‘ఏప్రిల్ ఫూల్స్’

Advertisement

బాగా పాపులర్ అయిన కథనం ఏంటంటే 1582 వరకు ఫ్రాన్స్‌లో జూలియన్ క్యాలెండర్’ వాడుకలో ఉండేది, దాని ప్రకారం ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం మొదలయ్యేది.అయితే 1582 సంవత్సరంలో జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారిందట.దాని ప్రకారం కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభం అయ్యేది. అయితే ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మారుమూల గ్రామాలలో ఉండేవారికి ఈ విషయం తెలీకపోవడంతో వారు పాత పద్ధతిలోనే అంటే ఏప్రిల్ 1న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకునేవారట.అయితే అప్పటికే క్యాలెండర్ మార్పు తెలిసి జనవరి1 న కొత్త సంవత్సరం జరుపునే వారు, పాత పద్ధతిని ఫాలో అయ్యే వారిని చూసి ‘ఏప్రిల్ ఫూల్స్’ అని పిలిచి ఆటపట్టించడం మొదలుపెట్టారట. దాంతో పాటు వారి వీపుపై తెలియకుండా పేపర్ తో చేసిన ఫిష్ లని స్టిక్ చేసి ‘ఏప్రిల్ ఫిష్’ అని ఏడిపించేవారట.గాలానికి చిక్కిన చేప ఎంత అమాయకంగా ఉంటుందో, అబద్ధాన్ని నమ్మి బోల్తా పడ్డ వారు కూడా అంతే అమాయకులని దీని అర్థమట.

also read:పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది!ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ. ఓలా, ఏథర్ పునాదులు కదిలిపోవాల్సిందేనా?

Advertisement

ధనవంతులని ఇమిటేట్ చేస్తూ ఎగతాళిగా 

ఇక వినిపించే మరో క్రేజీ హిస్టరీ ఏంటంటే ‘హిలేరియా’ అనే పండుగను మార్చి ప్రాచీన రోమ్‌లో మార్చి లాస్ట్ వీక్ లోజరుపుకునేవారట. రోమన్ పురాణాల ప్రకారం సైబిల్ దేవతను ఆరాధించే ఈ పండుగలో ప్రజలు రకరకాల గెటప్ లు,ముసుగులు వేసుకొని ఒకరినొకరు గుర్తుపట్టలేనంతగా మారిపోయేవారట.ఆ సమయంలో కామన్ పబ్లిక్ కూడా అధికారులను, ధనవంతులని ఇమిటేట్ చేస్తూ ఎగతాళి చేసేవారట.ఈ కల్చరే క్రమ క్రమంగా ఏప్రిల్ ఫూల్స్ డేగా మారిందని హిస్టరీ చెబుతుంది.

13వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ ఒక నిబంధన

ఇక వీటిలాగే బ్రిటన్‌లో కూడా దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండోయ్.13వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ ఒక నిబంధన పెట్టాడట. తను ఏ దారి గుండా వెళ్తే ఆ దారి ‘పబ్లిక్ రోడ్’ అయిపోతుందని, దానికి ప్రజలు పన్ను కట్టాలని ఆదేశించాడట .వినడానికి కాస్త వింతగా ఉంది కదూ. అయితే ఇది నచ్చని నాటింగ్‌హామ్‌షైర్‌లోని ‘గౌతమ్’ అనే ఊరి ప్రజలు, రాజు తమ ఊరిలోకి రాకుండా ఉండేందుకు అందరూ పిచ్చివాళ్లలా నటించారట.ఒక్కసారిగా ఊరు మొత్తం వింత వింత పనులు చేస్తూ కనిపించడంతో, ఆ ఊరి ప్రజల్ని మూర్ఖులని భావించిన రాజు అక్కడి నుంచి వెనుదిరిగాడట. దాంతో రాజునే బురిడీ కొట్టించిన ఆ రోజును మూర్ఖుల దినోత్సవంగా గుర్తుపెట్టుకున్నారట.

మస్ రైటర్ జెఫ్రీ చోసర్ రాసిన ‘కాంటర్బరీ టేల్స్’

ఇక లిటరేచర్ పరంగా 1387లో ఫేమస్ రైటర్ జెఫ్రీ చోసర్ రాసిన ‘కాంటర్బరీ టేల్స్’లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అందులో మార్చి 32వ తేదీన (అంటే ఏప్రిల్ 1) ఒక నక్క కోడిని బురిడీ కొట్టించినట్లు రాశారట. ‘మొత్తానికి ఇలా శతాబ్దాలుగా రకరకాల కథలు, సంప్రదాయాల ప్రకారం ఏప్రిల్ ఫూల్స్ డే అనేది ఒక అంతర్జాతీయ సరదా దినోత్సవంగా స్థిరపడిపోయిందన్న మాట.

ఇక ప్రస్తుతం మనమున్న ఈ డిజిటల్ యుగంలో కూడా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కూడా వింత ప్రకటనలు చేస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి. గూగుల్ సంస్థ గతంలో ‘టెలిపతిక్ సెర్చ్’ వంటి ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించి యూజర్లను ఫూల్స్ చేయడం బెస్ట్ ఎగ్జాంపుల్.ఏది ఏమైనా, ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా,ఒక చిన్న ప్రాంక్ ద్వారా పదిమంది ముఖాల్లో సరదాగా నవ్వులు పంచేలా ఈ రోజును జరుపుకోవడం గొప్ప విషయం అనే చెప్పాలి.

also read:తెలంగాణ అమర్ నాథ్ యాత్ర సలేశ్వరం జాతరపై పాలమూరు చిన్నాల పాట యూట్యూబ్ లో వైరల్

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×