E-Paper
Advertisement

Protein Deficiency: మీ శరీరంలో ఈ లక్షణాలున్నాయా ? ప్రోటీన్ లోపం కావొచ్చు జాగ్రత్త

Protein Deficiency: మీ శరీరంలో ఈ లక్షణాలున్నాయా ? ప్రోటీన్ లోపం కావొచ్చు జాగ్రత్త
Advertisement

Protein Deficiency: మన శరీరం సజావుగా పనిచేయడానికి అవసరమైన మూడు ప్రధాన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. దీనిని ‘శరీర నిర్మాణ దారువు’ అని పిలుస్తారు. కండరాల పెరుగుదల నుంచి హార్మోన్ల నియంత్రణ వరకు ప్రతి ప్రక్రియలో ప్రోటీన్ పాత్ర ఉంటుంది. అయితే.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తగినంత ప్రోటీన్ తీసుకోలేకపోతున్నారు. ప్రోటిన్ లోపం అనేది కేవలం కండరాల మీద మాత్రమే కాకుండా.. మన రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, చర్మంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు తగినంత ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి అత్యంత కీలకం.

మీకు తగినంత ప్రోటీన్ అందకపోతే ఏం జరుగుతుంది ?

Advertisement

ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.

1. కండరాల క్షీణత: శరీరానికి ఆహారం ద్వారా ప్రోటీన్ అందనప్పుడు, అది మన కండరాల నుండి ప్రోటీన్‌ను తీసుకోవడం ప్రారంభిస్తుంది. దీని వల్ల కండరాలు బలహీనపడతాయి. అంతే కాకుండా కండరాల పరిమాణం తగ్గుతుంది. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రోటీన్ తగ్గితే నడక, శారీరక పటుత్వం దెబ్బతింటుంది.

Advertisement

2. రోగనిరోధక శక్తి తగ్గడం: మన శరీరంలో వ్యాధులతో పోరాడే యాంటీబాడీస్ ప్రోటీన్‌తోనే తయారవుతాయి. ప్రోటీన్ లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి, తరచుగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. గాయాలు త్వరగా మానవు.

3. ఎముకల బలహీనత: చాలా మంది ఎముకల ఆరోగ్యానికి కాల్షియం మాత్రమే ముఖ్యం అనుకుంటారు. కానీ ఎముకల పటుత్వానికి ప్రోటీన్ కూడా చాలా అవసరం. ప్రోటీన్ లోపం వల్ల ఎముకల సాంద్రత తగ్గి, ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం పెరుగుతుంది.

4. చర్మం, జుట్టు, గోళ్ల సమస్యలు: మన చర్మం, జుట్టు, గోళ్లు అన్నీ ప్రోటీన్‌తో నిర్మితమైనవే. ప్రోటీన్ తక్కువైతే జుట్టు పల్చబడటం, రంగు మారడం, గోళ్లు విరగడం, చర్మం పొడిబారి పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

5.నిరంతరం ఆకలి వేయడం: ప్రోటీన్ మనకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మీరు తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంటే లేదా స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తినాలనిపిస్తుంటే.. అది మీ ఆహారంలో ప్రోటీన్ లోపాన్ని సూచిస్తుంది.

6. అలసట, నీరసం: శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల మెదడు మొద్దుబారినట్లు అనిపించడం, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం ,రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది.

Also Read: మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం ప్రకృతి ఇచ్చిన ‘మ్యాజిక్ పిల్‌’ ఇదే!

మీకు ఎంత ప్రోటీన్ అవసరం ?

ఒక సాధారణ వ్యక్తికి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు.. మీరు 60 కిలోల బరువు ఉంటే, మీకు రోజుకు కనీసం 48-60 గ్రాముల ప్రోటీన్ కావాలి. వ్యాయామం చేసేవారికి, గర్భిణీలకు ఈ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీన్ పెంచుకోవడానికి ఉత్తమ ఆహారాలు:
శాకాహారులకు: పప్పుధాన్యాలు, పనీర్, సోయా, నట్స్ (బాదం, వాల్‌నట్స్), గింజలు (చియా సీడ్స్, గుమ్మడి గింజలు), పాలు, పెరుగు.

మాంసాహారులకు: గుడ్లు, చికెన్ బ్రెస్ట్, చేపలు, లీన్ మీట్.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×