Foods To Avoid With Watermelon| వేసవికాలంలో పుచ్చకాయ తింటే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఎండగా ఉన్నప్పుడు పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండుతుంది. అంటే శరీరంలో నీరు తగ్గినా పుచ్చకాయ వల్ల మళ్లీ హైడ్రేషన్ వస్తుంది. ఈ పండులో నీటి శాతం, నాచురల్ షుగర్ అధికంగా ఉంటాయి. అయితే దీంతో పాటు కొన్ని ఆహారాలు కలిపి తినడం వల్ల కడుపులో సమస్యలు రావొచ్చు. తప్పుడు కాంబినేషన్ ఫుడ్స్ వల్ల్ గ్యాస్, అజీర్ణం కావచ్చు. పుచ్చకాయతో ఏమి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చాలామంది పుచ్చకాయతో పాటు పాల ఉత్పత్తులను పొరపాటున తింటారు. ఈ కలయిక జీర్ణ సమస్యలు ఉన్నవారికి మరింత సమస్యలు వస్తాయి. పాలు.. పుచ్చకాయతో పోలిస్తే భిన్నంగా జీర్ణమవుతాయి. కలిపి తినడం వలన ఉబ్బరం లేదా కడుపులో భారంగా ఉండొచ్చు. పుచ్చకాయతో పాటు పెరుగు, ఐస్ క్రీం, లేదా మిల్క్ షేక్ లు తినడం మానుకోండి. డైరీ ఐటమ్స్ తినే ముందు కొంత సమయం గ్యాప్ ఇవ్వండి.
వేయించిన ఆహారాలు హెవీగా ఉంటాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమవుతుంది. ఈ తేడా వలన జీర్ణక్రియ బ్యాలెన్స్ ఉండదు. దీనివల్ల బరువు లేదా ఉబ్బరం అనిపించవచ్చు. కారం పదార్థాలు కడుపు పొరను చికాకుపెడతాయి. వాటిని పుచ్చకాయతో కలపడం వలన అసౌకర్యం పెరుగుతుంది. కొంతమందికి మంట లేదా యాసిడిటీగా అనిపించవచ్చు. మటన్, భారీ ప్రోటీన్లు ఉండే ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ కలయిక వలన గ్యాస్, ఉబ్బరం రావచ్చు.
Also Read: రాత్రి వేళ పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
నిమ్మ, బత్తాయి, ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లలో సహజంగా అధిక యాసిడిటీ ఉంటుంది. వాటిని పుచ్చకాయతో కలపడం వలన జీర్ణక్రియ దెబ్బతినవచ్చు. కొందరు యాసిడిటీ లేదా కడుపులో చికాకుగా ఫీల్ అవుతారు. ఆరెంజ్ లేదా నిమ్మకాయలను పుచ్చకాయతో తరచుగా కలిపి తినకండి. సాఫ్ట్ డ్రింక్స్ లో అదనపు చక్కెర, కెమికల్స్ ఉంటాయి. వాటిని పుచ్చకాయతో కలపడం వలన ఉబ్బరం లేదా అలసట వస్తుంది. పుచ్చకాయ ఇప్పటికే చల్లగా ఉంటుంది, దానితో కూల్ డ్రింక్స్ లేదా స్వీట్స్ కలిపి తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
పుచ్చకాయను వేరే ఐటెమ్స్‌తో కలిపి తినకూడదు. దీన్ని సింగిల్‌గా ఎంజాయ్ చేస్తూ తినడం బెస్ట్. ఇది వేగంగా జీర్ణమవుతుంది. ఉదయం లేదా పగటిపూట తినడం సాధారణంగా మంచిది. పుచ్చకాయను మితంగా తినండి, ఎందుకంటే అతిగా తినడం వల్ల కూడా ఉబ్బరం వస్తుంది. పుచ్చకాయతో హెవీ ఆయిల్ ఫుడ్, కారం, లేదా పాలు, డైరీ ఫుడ్స్ కలిపి తినడం నివారించండి. సాధారణ ఆహారపు అలవాట్లు సహజంగా సౌకర్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.