E-Paper
Advertisement

Awake Brain Mapping: బ్రెయిన్ సర్జరీలో మాట పడిపోకుండా కొత్త టెక్నిక్.. ఇక భయం లేనట్టే!

Awake Brain Mapping: బ్రెయిన్ సర్జరీలో మాట పడిపోకుండా కొత్త టెక్నిక్.. ఇక భయం లేనట్టే!
Advertisement

Awake Brain Mapping: మెదడులో క్యాన్సర్ గడ్డ ఉందని తెలియగానే ఎవరికైనా ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడటం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత మనిషి మళ్లీ మామూలుగా మాట్లాడగలడా? తన పనులు తాను చేసుకోగలడా? అనే భయం కుటుంబ సభ్యులను వెంటాడుతూనే ఉంటుంది. దీనికి చెక్ పెట్టేలా డాక్టర్లకు ‘అవేక్ బ్రెయిన్ మ్యాపింగ్’ అనే పద్ధతి ఎంతో సహాయపడింది. అంటే.. ఆపరేషన్ జరుగుతున్నప్పుడే రోగిని నిద్రలేపి మాట్లాడిస్తూ చేసే చికిత్స అన్నమాట. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని మరింత మెరుగ్గా, రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేలా కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

అవేక్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే?

చాలామందికి ఇది వినగానే ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఈ పద్ధతిలో సర్జరీ జరుగుతుండగానే రోగిని నిద్రలేపుతారు. మెదడుకు నొప్పి తెలియదు కాబట్టి.. రోగికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. డాక్టర్లు మెదడులోని కొన్ని భాగాలపై చిన్నపాటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇస్తూ, రోగిని మాట్లాడమని లేదా బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పమని అడుగుతారు. ఒకవేళ డాక్టర్ ఒక చోట సిగ్నల్ ఇచ్చినప్పుడు రోగి సరిగ్గా మాట్లాడలేకపోతే, ఆ భాగం చాలా కీలకమైనదని అర్థం చేసుకుని దాన్ని ముట్టుకోకుండా వదిలేస్తారు.

Advertisement

Also Read: శాఖాహారం తీసుకుంటే క్యాన్సర్ రాదా? 16 ఏళ్ల పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు!

సర్జరీ సక్సెస్ అవ్వాలంటే?

ఇప్పటివరకు డాక్టర్లు రోగి సమాధానం చెప్పగలుగుతున్నాడా లేదా అనేది మాత్రమే చూసేవారు. కానీ తాజా రీసెర్చ్ ప్రకారం.. రోగి ఎంత వేగంగా సమాధానం చెప్పాడు? మాటలో ఏవైనా మార్పులు ఉన్నాయా? అనేది కూడా గమనించాలి. సమాధానం కరెక్ట్‌గా చెప్పినా అది కొంచెం ఆలస్యంగా వస్తే, అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఈ చిన్న చిన్న మార్పులను గమనిస్తే ఆపరేషన్‌లో 100% విజయం సాధించినట్టే.

ఒక్కో రోగికి ఒక్కో పద్ధతి:

Advertisement

ఒక్కొక్కరి మెదడు ఒక్కోలా పనిచేస్తుంది. అందుకే అందరికీ ఒకే రకమైన పద్ధతి పనికిరాదు. రోగికి ఏది అత్యవసరమో దాన్ని బట్టి మెదడులోని ఆ భాగాలను చాలా జాగ్రత్తగా కాపాడవచ్చు. మైండ్‌ట్రేస్ అనే కొత్త సాఫ్ట్‌వేర్ సాయంతో డాక్టర్లు ఆపరేషన్ థియేటర్‌లోనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు, రోగి తన పాత జీవితాన్ని మళ్లీ సంతోషంగా గడపడానికి మార్గం సుగమం అవుతుంది.

Also Read: కాఫీ కంటే రాగి జావ ఎంత మంచిదే తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×