E-Paper
Advertisement

Ragi java Benefits: కాఫీ కంటే రాగి జావ ఎంత మంచిదే తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Ragi java Benefits: కాఫీ కంటే రాగి జావ ఎంత మంచిదే తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Advertisement

Ragi java Benefits: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనిషి ఓ యంత్రంలా మారిపోతుంటాడు. ఈ క్రమంలో ఆకలి వేసిందని ఏదో ఒకటి తినేస్తుంటాం. అలా తీసుకునే ఆహారం నుంచి పోషకాలు అందకపోగా.. అదనంగా ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటాం. అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. ఈ బిజీ లైఫ్‌లోనూ సంపూర్ణ ఆరోగ్యం పొందండం అంత కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.

ఉదయం నిద్రలేవగానే చాలామందికి వేడివేడి కాఫీ కప్పు పట్టుకోవడం అలవాటు. ఆ కెఫీన్ ఇచ్చే కిక్ అప్పటికప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుందేమో కానీ, మన శరీరానికి కావాల్సిన నిజమైన శక్తిని మాత్రం ఇవ్వదు. దానికి బదులుగా మన బామ్మల కాలం నాటి రాగి జావను తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో కాఫీ కంటే రాగి జావ ఎందుకు మేలో తెలుసుకుందాం రండి..

పోషకాల గని రాగి:

Advertisement

మన పూర్వీకులు రాగిని అద్భుత ధాన్యం అని పిలిచేవారు. దీనిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం ఇతర ధాన్యాల కంటే రాగుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు, ఎముకల నొప్పులతో బాధపడే పెద్దవారికి ఇదొక అద్భుతమైన ఆహారం. కాఫీ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ కలిగే అవకాశం ఉంటే.. రాగి జావ శరీరాన్ని చల్లబరుస్తూ తగినంత తేమను అందిస్తుంది.

Also Read: రోజంతా అలసటగా ఉంటుందా? ఈ ప్రొటీన్ ఫుడ్స్‌తో సూపర్ యాక్టివ్‌గా మారిపోండి!

బరువు, చక్కెర అదుపులో:

Advertisement

అధిక బరువును తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి రాగి జావ ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేవగానే కాఫీలో పంచదార కలిపి తాగడం కంటే రాగి జావ తీసుకోవడం ఆరోగ్యానికి మంచింది. ఇందులో ఉండే అమినో యాసిడ్లు ఆకలిని తగ్గిస్తాయి. దీంతో ఎక్కువగా తినాలనే కోరికను కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అలాగే, రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు రాగిజావను డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

ఒత్తిడి పారిపోతుంది:

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాగుల్లో ఉండే ట్రైప్టోఫాన్ అనే కంటెంట్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కాఫీ తాగితే కలిగే నిద్రలేమి సమస్యలు రాగి జావతో ఉండవు. ఇది సహజమైన రిలాక్సేషన్ ఇచ్చి, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. కాబట్టి.. రేపటి నుంచి మీ ఉదయాన్ని కెఫీన్‌తో కాకుండా, పోషకాలు నిండిన రాగి జావతో ప్రారంభించి చూడండి.. మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్చపోతారు.

Also Read: 16 ఏళ్ల బాలిక కిడ్నీలో రాళ్లు.. ఈ చిన్న పొరపాటే శాపంగా మారుతోందంటున్న నిపుణులు!

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×