E-Paper
Advertisement

Workout routines: ఇంట్లోనే వర్కౌట్.. ఇలా చేస్తే జిమ్ అక్కర్లేదు !

Workout routines: ఇంట్లోనే వర్కౌట్.. ఇలా చేస్తే జిమ్ అక్కర్లేదు  !
Advertisement

Workout routines: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమయం లేకపోవడం వల్ల లేదా బయటకు వెళ్లలేక చాలా మంది వ్యాయామానికి దూరమవుతున్నారు. వ్యాయామం అంటే కేవలం ఖరీదైన పరికరాలతో చేసేది మాత్రమే కాదు. మన ఇంట్లోనే, తక్కువ స్థలంలో, ఎటువంటి ఖర్చు లేకుండా క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న కసరత్తులు కూడా మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవారు సరైన పద్ధతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.  ఇంట్లోనే.. సులభంగా చేసుకోగలిగే వ్యాయామ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి దగ్గర వ్యాయామాలు:
వ్యాయామం మొదలుపెట్టే ముందు:
ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు శరీరాన్ని సిద్ధం చేయడం చాలా అవసరం. నేరుగా కఠినమైన పనులు చేయకుండా.. ఐదు నిమిషాల పాటు ఒళ్లు విరుచుకోవడం లేదా ఒకే చోట నిలబడి నెమ్మదిగా నడవడం వంటివి చేయాలి. దీని వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాయామం చేసే సమయంలో.. కండరాలు పట్టేయడం లేదా గాయాలు కావడం వంటి సమస్యలు రావు. శరీరం వేడెక్కిన తర్వాతే అసలైన వ్యాయామం చేయడం బెస్ట్.

Advertisement

చేతులు , ఛాతి భాగం బలంగా తయారవ్వడానికి నేలపై బోర్లా పడుకుని చేతులతో శరీరాన్ని పైకి లేపే పద్ధతి చాలా బాగా పని చేస్తుంది. దీన్ని మొదట్లో చేయడం కష్టంగా అనిపిస్తే.. మోకాళ్లను నేలపై ఆనించి కూడా చేయవచ్చు. ఇది భుజాలను, చేతులను దృఢంగా మారుస్తుంది. అలాగే గోడకు ఆనుకుని చేతులతో ఒత్తిడి కలిగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజుకు పది నుంచి పదిహేను సార్లు చేయడం వల్ల శరీర పైభాగం ఆకృతి మెరుగు పడుతుంది.

పొట్ట , నడుము భాగం కోసం:
చాలా మందిని వేధించే సమస్య పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం. దీన్ని తగ్గించుకోవడానికి నేలపై వెల్లకిలా పడుకుని, కాళ్లను కొంచెం పైకి లేపి ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే తల వెనుక చేతులు ఉంచి, పైకి లేవడానికి ప్రయత్నించడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, నడుము నొప్పి రాకుండా కాపాడుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల శరీరానికి మంచి బలం లభిస్తుంది.

Advertisement

Also Read: ఆకుపచ్చ ద్రాక్ష Vs నల్లటి ద్రాక్ష.. ఏవి ఆరోగ్యానికి బెస్ట్ ?

కాళ్ల దృఢత్వం, సమతుల్యత:
కాళ్లు బలంగా ఉండటానికి కుర్చీలో.. కూర్చుని లేస్తున్నట్లుగా చేసే వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. రెండు కాళ్ల మధ్య కొంచెం ఎడం ఉంచి, నడుమును వెనక్కి వంచి నెమ్మదిగా కిందకు దిగి మళ్ళీ పైకి లేవాలి. ఇది తొడలు, పిరుదుల కండరాలను బలోపేతం చేస్తుంది. అలాగే ఒకే చోట నిలబడి మోకాళ్లను పైకి ఎత్తుతూ నడవడం వల్ల శరీరానికి మంచి శ్రమ కలుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది.

వ్యాయామం అనేది కేవలం ఒక రోజులో ఫలితాన్ని ఇచ్చేది కాదు. దీన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. ప్రారంభంలో తక్కువ సమయం కేటాయించినా.. క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. సరైన ఆహారంతో పాటు ఈ చిన్నపాటి వ్యాయామాలు చేస్తే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని గుర్తుంచుకుని.. నేటి నుంచే మీ ఇంటి వద్దే వ్యాయామం ప్రారంభించండి. క్రమశిక్షణతో కూడిన ఈ ప్రయత్నం మిమ్మల్ని శారీరకంగా , మానసికంగా దృఢంగా ఉంచుతుంది.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×