E-Paper
Advertisement

Benefits of Early Dinner: జీర్ణక్రియ మెరుగుపడాలా? అయితే మీ డిన్నర్ టైమ్ మార్చుకోవాల్సిందే !

Benefits of Early Dinner: జీర్ణక్రియ మెరుగుపడాలా? అయితే మీ డిన్నర్ టైమ్ మార్చుకోవాల్సిందే !
Advertisement

Benefits of Early Dinner: నేటి వేగవంతమైన జీవన శైలిలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అర్థరాత్రి వరకు మేల్కొనడం, ఆలస్యంగా భోజనం చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం ఏమి తింటున్నాం అనే దానితో పాటు ఎప్పుడు తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. సూర్యాస్తమయం సమయంలో లేదా రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. మెరుగైన జీర్ణక్రియ:

మనం నిద్రపోయే సమయానికి.. మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని సగానికి పైగా అరిగించి ఉండాలి. ఆలస్యంగా భోజనం చేస్తే, శరీరం నిద్రపోవడానికి బదులుగా ఆహారాన్ని అరిగించే పనిలో నిమగ్నమై ఉంటుంది. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి, కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.

Advertisement

2. బరువు తగ్గడానికి :

రాత్రిపూట మన శరీర మెటబాలిజం (జీవక్రియ) నెమ్మదిస్తుంది. ఆలస్యంగా తిన్నప్పుడు శరీరానికి ఆ కేలరీలను ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఫలితంగా అది కొవ్వుగా పేరుకుపోతుంది. రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా వాడుకుంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో సహాయ పడుతుంది.

3. ప్రశాంతమైన నిద్ర:

కడుపు నిండా ఆహారం ఉండి, అది అరగకముందే నిద్రపోతే నిద్రలో అసౌకర్యంగా ఉంటుంది. త్వరగా భోజనం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడి, ‘మెలటోనిన్’ అనే నిద్ర హార్మోన్ సరిగ్గా విడుదలవుతుంది. దీని వల్ల గాఢ నిద్ర పడుతుంది. అంతే కాకుండా ఉదయం నిద్ర లేవగానే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.

4. గుండె ఆరోగ్యం, రక్తపోటు:

రాత్రిపూట ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి, రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. త్వరగా భోజనం చేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.

5. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల ఇన్‌సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 గంటల సమయం ఉంటే, ఉదయాన్నే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

6. శక్తివంతమైన ఉదయం:

రాత్రి త్వరగా తిన్నవారు ఉదయం లేవగానే ఎంతో తేలికగా.. చురుగ్గా ఉంటారు. రాత్రి ఆహారం పూర్తిగా అరిగిపోవడం వల్ల ఉదయం మంచి ఆకలి వేస్తుంది. తద్వారా మీరు పోషకవిలువలున్న అల్పాహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×