Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువ విద్యార్థి బలైయ్యాడు. లక్ష రూపాయల నష్టం రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్‌లో నష్టం రావడంతోనే యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు CI సీతారామం.
రంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు విద్యార్థి బలి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఈ ఘటన జరిగింది. దెబ్బడగూడ గ్రామానికి చెందిన విక్రమ్.. నారాయణగూడలోని బీజేఆర్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. విక్రమ్ ఇంటి నుంచి సుమారు లక్ష తీసుకొచ్చి “ఫన్ ఇన్ ఎక్స్‌ఛేంజ్” అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు.
డబ్బు కోల్పోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన విక్రమ్..
అయితే బెట్టింగ్‌లో మొత్తం డబ్బు కోల్పోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతుందన్న భయంతో.. ఈనెల 23న పొలానికి వెళ్లి పారాఫోర్స్ అనే హెర్బిసైడ్‌ను తాగి సూసైడ్ చేసుకున్నాడు. అనుమానం వచ్చిన అన్న శ్రీకాంత్ పొలానికి వెళ్లి చూడగా.. విక్రమ్ అపస్మారక స్థితిలో నేలపై పడివున్నాడు. వెంటనే యశోద హాస్పిటల్‌కు తరలించగా.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి మార్చారు. విక్రమ్ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు.
Also Read: ఫ్లెక్సీ వార్.. సీఐపై రెచ్చిపోయిన కారుమూరి.. తణుకు వై జంక్షన్ వద్ద హైటెన్షన్!
పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్
ఈ ఘటనపై విక్రమ్ అన్న శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు నష్టం కారణంగా వచ్చిన మానసిక ఒత్తిడే.. విక్రమ్ మృతికి కారణమన్నారు సీతారామం. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు యువత కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో విద్యార్థి బలి
రంగారెడ్డి జిల్లా కందుకూరు పరిధి దెబ్బడగూడలో ఘటన
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.లక్ష పోగొట్టుకున్న డిగ్రీ విద్యార్థి విక్రమ్ pic.twitter.com/1otSGUcFjZ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2025