E-Paper
Advertisement

Best Sunscreen For Summer: ఎండతో ఇక నో ఫైట్! ఈ సన్‌స్క్రీన్ హ్యాక్స్‌తో మీ స్కిన్ సూపర్ సేఫ్!

Best Sunscreen For Summer: ఎండతో ఇక నో ఫైట్! ఈ సన్‌స్క్రీన్ హ్యాక్స్‌తో మీ స్కిన్ సూపర్ సేఫ్!
Advertisement

Best Sunscreen For Summer: సమ్మర్‌లో బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఈ సమయంలో ఎండ వల్ల చర్మం నల్లబడటం, మంటలు, అలర్జీలు రావడం సర్వసాధారణం. అయితే.. మనం వాడే ‘సన్‌స్క్రీన్’ ఈ సమస్యల నుంచి మనల్ని కాపాడే ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది. మార్కెట్లో ఎన్నో రకాల సన్‌స్క్రీన్లు ఉన్నప్పటికీ.. మీ చర్మ తత్వానికి తగ్గట్టుగా, సరైన SPF ఉన్న దానిని ఎంచుకోవడం ఎలాగో తెలిస్తే.. ఎండాకాంలో కూడా మీ చర్మం మెరిసిపోతుంది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్ కోసం బెస్ట్ సన్‌స్క్రీన్ ఎలా ఎంచుకోవాలి ?
వేసవిలో చర్మం జిడ్డుగా మారడం లేదా డ్రై అవడం జరుగుతుంటుంది. అందుకే సన్‌స్క్రీన్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి.

Advertisement

1. SPF ఎంత ఉండాలి?
మనం సన్‌స్క్రీన్ బాటిల్ పై చూసే మొదటి విషయం SPF. సాధారణంగా మన లాంటి ఉష్ణమండల దేశాల్లో ఉండేవారికి SPF 30 నుంచి SPF 50 మధ్య ఉన్న సన్‌స్క్రీన్ సరిపోతుంది.

SPF 30: ఇది దాదాపు 97% UVB కిరణాలను అడ్డుకుంటుంది.

Advertisement

SPF 50: ఇది 98% కిరణాలను అడ్డుకుంటుంది.

ఎక్కువ SPF ఉంటే ఎక్కువ సేపు ఎండలో ఉండొచ్చని అర్థం కాదు. కానీ అది ఇచ్చే రక్షణ మెరుగ్గా ఉంటుంది.

2. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి ?
కేవలం SPF మాత్రమే చూస్తే సరిపోదు. సూర్యుడి నుంచి UVA (చర్మం ముడతలు పడటానికి కారణం) , UVB (చర్మం రంగు మారడానికి కారణం) అనే రెండు రకాల కిరణాలు వస్తాయి. ఈ రెండింటి నుంచి రక్షణ ఇచ్చే దాన్నే ‘బ్రాడ్ స్పెక్ట్రమ్’ అంటారు. మీ సన్‌స్క్రీన్ ప్యాకింగ్ మీద PA+++ లేదా PA++++ అని ఉందో లేదో చూసుకోండి.

3. మీ స్కిన్ టైప్ ని బట్టి ఎంపిక:
అందరికీ ఒకే రకమైన సన్‌స్క్రీన్ సెట్ అవ్వదు.

జిడ్డు చర్మం: వీరు ‘Gel-based’ లేదా ‘Matte finish’ సన్‌స్క్రీన్లను వాడాలి. ఇవి చర్మాన్ని జిడ్డుగా మార్చవు.

పొడి చర్మం: వీరు ‘Cream-based’ లేదా మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్లను ఎంచుకోవాలి.

సెన్సిటివ్ స్కిన్: వీరు కెమికల్స్ తక్కువగా ఉండే ‘Mineral Sunscreens’ (Zinc Oxide లేదా Titanium Dioxide ఉన్నవి) వాడటం మంచిది.

సన్‌స్క్రీన్ వాడేటప్పుడు చేయకూడని తప్పులు:
చాలా మంది సన్‌స్క్రీన్ రాసుకున్నా కూడా చర్మం పాడవుతుందని చెబుతుంటారు. దానికి కారణం దాన్ని సరిగ్గా వాడకపోవడమే.

తక్కువ పరిమాణం: ఎండాకాలంలో దీనిని తక్కువ వాడితే సరిపోదు. మీ ముఖం , మెడ కోసం ‘టూ ఫింగర్ రూల్’ (చూపుడు వేలు, మధ్య వేలు నిండా సన్‌స్క్రీన్ తీసుకోవడం) పాటించాలి.

చివరి నిమిషంలో రాసుకోవడం: బయటకు వెళ్లే కనీసం 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అప్పుడే అది చర్మంలోకి ఇంకి రక్షణ ఇవ్వడం మొదలు పెడుతుంది.

మళ్ళీ రాసుకోకపోవడం: ఒక్కసారి రాస్తే రోజంతా పనిచేయదు. ఎండలో ఎక్కువగా తిరిగే వారు ప్రతి 2-3 గంటలకు ఒకసారి మళ్ళీ రాసుకోవాలి.

Also Read: ఎండాకాలంలో ఎగ్స్ తింటున్నారా ? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు

వేసవిలో మరికొన్ని జాగ్రత్తలు:
కేవలం సన్‌స్క్రీన్ మీదనే ఆధారపడకుండా.. మరి కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంకా మంచిది.

కళ్ళజోడు: కళ్ళ చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని కాపాడుకోవడానికి యూవీ ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ వాడండి.

సరైన దుస్తులు: కాటన్ బట్టలు, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల నేరుగా ఎండ తగలకుండా ఉంటుంది.

నీరు ఎక్కువగా తాగాలి: చర్మం లోపలి నుంచి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం.

సన్‌స్క్రీన్ అనేది కేవలం అందం కోసం కాదు.. అది మీ చర్మ ఆరోగ్యం కోసం. చర్మ క్యాన్సర్ వంటి ముప్పుల నుంచి తప్పించుకోవడానికి, అకాల వృద్ధాప్యం రాకుండా ఉండటానికి సన్‌స్క్రీన్ తప్పనిసరి. ఈ వేసవిలో మీ స్కిన్ టైప్ కి తగ్గ బెస్ట్ సన్‌స్క్రీన్‌ని మీ బ్యాగులో ఎప్పుడూ ఉంచుకోండి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×