E-Paper
Advertisement

Snake Plant: ఈ ఒక్క మొక్కతో ఇంటికి అందం.. ఒంటికి ఆరోగ్యం,ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Snake Plant: ఈ ఒక్క మొక్కతో ఇంటికి అందం.. ఒంటికి ఆరోగ్యం,ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Snake Plant: స్నేక్ ప్లాంట్ కేవలం ఇంటి అందాన్ని పెంచే మొక్క మాత్రమే కాదు. ఇది అనేక ఆరోగ్య, వాస్తు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది గాలిని శుద్ధి చేసే అత్యంత శక్తివంతమైన ఇండోర్ మొక్కలలో ఇది కూడా ఒకటి. స్నేక్ ప్లాంట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. గాలి శుద్ధి:

స్నేక్ ప్లాంట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం గాలి శుద్ధి చేయగల సామర్థ్యం. ఇది బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలీన్, జిలీన్ ,టోలున్ వంటి విషపూరిత కాలుష్యాలను గాలి నుంచి గ్రహిస్తుంది.

2. రాత్రిపూట ఆక్సిజన్ విడుదల:

చాలా మొక్కలు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. కానీ స్నేక్ ప్లాంట్ ప్రత్యేకంగా రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందుకే దీనిని బెడ్ రూంలో ఉంచడం చాలా మంచిది.

3. కార్బన్ డయాక్సైడ్ గ్రహణ సామర్థ్యం

ఇది ఇతర ఇండోర్ మొక్కల కంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట, గాలి నాణ్యతను మెరుగు పరుస్తుంది.

4. తక్కువ నిర్వహణ :

స్నేక్ ప్లాంట్‌కు ఎక్కువ నీరు లేదా సూర్యరశ్మి అవసరం లేదు. ఇది తక్కువ కాంతిలో , అప్పుడప్పుడు నీరు పోసినా కూడా బాగా పెరుగుతుంది. బిజీగా ఉండే వారు దీనిని పెంచుకోవచ్చు.

5. అలెర్జీలను తగ్గిస్తుంది:

గాలిలోని విష పదార్థాలు, కాలుష్యాలను తొలగించడం ద్వారా.. ఇది అలెర్జీలు , శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

6. వాస్తు, ఫెంగ్ షూయ్ ప్రయోజనాలు:

వాస్తు శాస్త్రం ప్రకారం, స్నేక్ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచడం శుభప్రదం. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో చెడు శక్తిని తగ్గిస్తుంది.

7. కంటికి ఇంపుగా ఉంటుంది:

దీని నిటారైన, పదునైన ఆకులు ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌కు చక్కటి రూపాన్నిస్తాయి. ఇది ఇంటికి ఒక స్టైలిష్, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది.

8. మనశ్శాంతిని పెంచుతుంది:

ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పచ్చని మొక్కలు ఒత్తిడిని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

9. తేమను నియంత్రిస్తుంది:

మొక్కలు సహజంగా గాలిలోని తేమను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి వాతావరణంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

10. దోమలను దూరంగా ఉంచుతుంది:

కొన్ని అధ్యయనాల ప్రకారం.. స్నేక్ ప్లాంట్ దోమలు , ఇతర కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయ పడుతుందని సూచిస్తున్నాయి.

Also Read: ఏ అలవాట్లు మెదడు ఆరోగ్యానికి.. నష్టం కలిగిస్తాయో తెలుసా ?

స్నేక్ ప్లాంట్‌ను ఉంచడానికి ఉత్తమమైన స్థానం:

స్నేక్ ప్లాంట్‌కు వాస్తు, ఆరోగ్య ప్రయోజనాలు రెండూ ఉండటం వల్ల దానిని ఉంచే స్థానం చాలా ముఖ్యం.

బెడ్ రూం: రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేసే ఏకైక మొక్కలలో ఇది ఒకటి కాబట్టి.. ప్రశాంతమైన నిద్ర కోసం దీనిని బడ్ రూంలో ఉంచడం ఉత్తమం.

తూర్పు/ఆగ్నేయం: వాస్తు ప్రకారం.. ఈ మొక్కను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం డబబు ఆకర్షిండానికి అంతే కాకుండా ఆరోగ్యానికి చాలా శుభకరం.

లివింగ్ రూమ్ / ఆఫీస్: గాలి శుద్ధి కోసం, సానుకూల శక్తిని ఆకర్షించడానికి దీనిని లివింగ్ రూమ్‌లోని ఒక మూలలో లేదా ఆఫీస్ డెస్క్ పక్కన ఉంచవచ్చు.

కిటికీ దగ్గర: దీనికి తక్కువ సూర్యరశ్మి అవసరం కాబట్టి.. నేరుగా సూర్యరశ్మి తగలకుండా కిటికీ దగ్గర ఉంచితే మంచిది.

Related News

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

Big Stories

×