E-Paper
Advertisement

Satish Kumar Murder Case: సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది.. గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో

Satish Kumar Murder Case: సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది.. గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో
Advertisement

Satish Kumar Murder Case: టీటీడీ మాజీ ఏవీఎస్ఓ, ఎస్ఐ సతీష్‌కుమార్ హత్యకుసంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఏమాత్రం తప్పించుకోవడానికి వీల్లేకుండా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది

Advertisement

టీటీడీ మాజీ ఏవీఎస్ఓ, ఎస్ఐ సతీష్‌కుమార్ హత్యని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రెండు రోజుల సీన్ రీకన్స్ట్రక్షన్‌తో ఓ క్లారిటీకి వచ్చారు విచారణ అధికారులు. ఘటన స్థలంలో లభించిన సతీష్ కుమార్ మొబైల్‌ను విజయవాడ ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు పోలీసులు. మొబైల్ పగిలిపోవడంతో డేటా రికవరీ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు.

చనిపోవడానికి ముందు సతీష్ కుమార్ ఎవరెవరితో మాట్లాడాడు? పరకామణి చోరీ కేసులో నవంబర్ ఆరున సీఐడీ విచారణకు వెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన నుంచి మరణించడానికి ముందు వరకు ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడాడు? వాట్సాప్ చాటింగ్‌లపై దృష్టి సారించారు.

Advertisement

గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో

మరోవైపు సతీష్ కుమార్ ట్రైన్ డోర్ దగ్గర నిలబడినప్పుడు గుండెపోటుకు గురయ్యాడా? కళ్ళు తిరిగాయా? గ్యాస్ వల్ల చెస్ట్ పెయిన్ ఏమైనా వచ్చిందా? తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షల్లో పాథాలజీ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు పోలీసులు. చనిపోవడానికి ముందు టీ తాగాడని పోస్టుమార్టం సమయంలో గుర్తించింది డాక్టర్ల బృందం.

టీ, మద్యం తరహా ఏ ఇతర మత్తు పదార్థాలు వంటివి తీసుకున్నాడా? అన్న‌కోణంలో పోస్టుమార్టం నిర్వహించారు డాక్టర్లు.  తలకు బలమైన గాయం తగలడం వల్లే సతీష్ కుమార్ చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు. తలకు బలమైన వస్తువు ఏది తగిలింది? అనేది తేలాల్సివుంది.

ALSO READ: భర్తని ఇరికించిన భార్య.. ఆ తర్వాత పోలీసోడితో రిలేషన్ షిప్

కుటుంబసభ్యులు మాత్రం సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ హత్యేనని చెబుతున్నారు. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాత రాజకీయ నేతల మాటలను సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ వారంలో సతీష్ కేసు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×