E-Paper
Advertisement

TG LT Recruitment: తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TG LT Recruitment: తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TG LT Recruitment: తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎంహెచ్ఎస్ఆర్బీ సోమవారం విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా, 23,323 మంది పరీక్ష రాశారు. తాజాగా ఈ పోస్టులకు ఎంపికైన వారి లిస్టును విడుదల చేశారు. స్పోర్ట్స్ కోటా సెలక్షన్ జాబితాను సెపరేట్ గా విడుదల చేస్తామని ఎంహెచ్ఎస్ఆర్బీ వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తులు రాకపోవడంతో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 1284 పోస్టులు

రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II 1284 పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2024లో నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2024 నవంబర్ 10న నిర్వహించారు. ఈ పోస్టులకు 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 23,323 మంది పరీక్షకు హాజరయ్యారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, వెయిటేజ్ పాయింట్ల ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం 1260 మంది అభ్యర్థులను మూడు విభాగాలలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టులకు తాత్కాలికంగా ఎంపిక చేశారు. వికలాంగుల కేటగిరీలో రెండు పోస్టులు, హైకోర్టు ఆదేశాలతో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో 18 పోస్టులకు మెరిట్ జాబితా విడుదల చేయాల్సి ఉంది.

షరతులు వర్తిస్తాయ్

ఎంపిక జాబితాలోని పేరు కలిగిన వారు నియామకానికి అన్ని విధాలుగా తగినవారని సంతృప్తి చెందితే తప్ప తుది ఎంపికకు అర్హత లభించదు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి. అభ్యర్థి తప్పుడు సమాచారం సమర్పించినట్లు బోర్డు దృష్టికి వస్తే, ఏ దశలోనైనా ఎంపిక రద్దు చేస్తారు. ఇతర పోస్టులకు కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేయనున్నారు.

Also Read: AIIMS DELHI: పదో తరగతి అర్హతతో 1383 ఉద్యోగాలు.. ఎగ్జామ్ పాసైతే చాలు, జాబ్ మీదే

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×