E-Paper
Advertisement

Viral Video: స్కూల్ ఈవెంట్‌లో.. విద్యార్థినుల అర్ధనగ్న స్టెప్పులు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Viral Video: స్కూల్ ఈవెంట్‌లో.. విద్యార్థినుల అర్ధనగ్న స్టెప్పులు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Advertisement

Viral Video: సాధారణంగా ప్రతీ పాఠశాలలో నిత్యం ఏదోక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. మన సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ఈవెంట్లను స్కూల్ యాజమాన్యాలు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే బెంగాల్ లోని ఓ స్కూల్లోనూ కల్చరల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. అయితే అక్కడ కొందరు విద్యార్థినులు చేసిన పని.. తీవ్ర వివాదస్పదంగా మారింది. అర్ధనగ్న దుస్తులతో వేదికపైకి వచ్చి.. ఓ పాటకు డ్యాన్స్ చేయడంపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అసలేం జరిగిందంటే?

కోల్ కత్తాలోని జీబన్ జ్యోతి మోడల్ స్కూల్లో జరిగిన విద్యార్థినుల ‘టవల్ డ్యాన్స్’ (Towel Dance) వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు విద్యార్థినులు కేవలం తువ్వాళ్లు (Towels) కట్టుకుని వేదికపై వచ్చి.. అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్ చేశారు. టవల్ ను ఓపెన్ చేస్తూ స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో.. అది క్షణాల్లోనే వైరల్ గా మారింది.

Advertisement

నెటిజన్లు ఆగ్రహం..

విద్యార్థినుల అర్ధనగ్న డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అసభ్యకరంగా (Obscene), అసహ్యంగా (Disgusting) ఉందని మండిపడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలల్లో.. ఇటువంటి ప్రదర్శనలకు ఎలా అనుమతించారని విద్యాశాఖను, స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. బెంగాల్ వంటి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రంలో పాఠశాల వేదికపై ఇలాంటి ప్రదర్శనలు జరగడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: BRS Party: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. పాపం బీఆర్ఎస్.. నైరాశ్యంలో కేడర్!

రంగంలోకి విద్యాశాఖ

విద్యార్థినుల డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో.. స్థానిక విద్యాశాఖ అధికారులు సైతం ఈ ఘటనపై దృష్టిసారించారు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయుల నుండి వివరణ కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంతో పాటు ఇలాంటి కార్యక్రమాలను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు సదరు పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

పాఠశాల వర్గాలు మౌనం

టవల్ డ్యాన్స్ వీడియో పెద్ద ఎత్తున వివదాస్పదంగా మారినప్పటికీ.. జీబన్ జ్యోతి మోడల్ స్కూల్ (Jeeban Jyoti Model School) ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఘటనపై పాఠశాలలో ఏదైనా విచారణకు ఆదేశించారా? లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై కూడా పాఠశాల యాజమాన్యం ఎలాంటి క్లారిటీ రాకపోవడం గమనార్హం.

Also Read: Telangana BJP strategy: టార్గెట్ హైదరాబాద్.. బీజేపీ సరికొత్త స్ట్రాటజీ.. గ్రేటర్‌పై పట్టుకోసం స్కెచ్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×