E-Paper
Advertisement

Sweet Potatoes: శీతాకాలంలో చిలగడదుంప ఎందుకు తినాలో తెలుసా?.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Sweet Potatoes: శీతాకాలంలో చిలగడదుంప ఎందుకు తినాలో తెలుసా?.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Advertisement

Sweet Potatoes: మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ఆహారాల్లో చిలగడదుంప మొదటి స్థానంలో ఉంటుంది. ఆ ప్రత్యేకతల వల్లే శివరాత్రి రోజున ఇది అల్పాహారమైంది. ఈ స్వీట్ పొటాటో అసలైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఒక్క ఉపవాసం రోజునే కాదు, మీ రోజువారీ ఆహారంలోనూ తప్పనిసరిగా దీన్ని చేర్చుకుంటారు. అయితే, చాలామందికి చిలగడదుంప అంటే కాస్త చిన్నచూపే. బంగాళదుంపలా ఇది అందరి ఫేవరెట్‌ ఫుడ్‌ కాలేకపోయింది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనే కారణంతో ఈ దుంపల్ని పక్కకు పెట్టేస్తుంటారు. కానీ మీకు తెలుసా.. శీతాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను అడ్డుకోవడంలో దీని పాత్ర కీలకమని. ఈ స్వీట్‌ పొటాటో తీపి కబుర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

సంపూర్ణ పోషకాహారం:

ప్రస్తుతం మార్కెట్లో చిలగడదుంపలు విరివిగా లభిస్తాయి. అందుకే.. వీటిని శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని పిలుస్తుంటారు. వీటిని తరచూ తినడం వల్ల అధిక బరువును నియంత్రణలో పెట్టుకోవచ్చు. చిలగడదుంపల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే స్వీట్ పొటాటోస్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ చిలగడదుంపల్లో ఎ, బి6, సీ విటమిన్లు, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ దుంపల్లోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement

Read Also: వింటర్ ఎఫెక్ట్-సైనస్ వేధిస్తోందా.. డోంట్ వర్రీ, ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ రిలీఫ్!

ఇమ్యూనిటీ బూస్టర్:

ముఖ్యంగా శీతాకాలంలో మన శరీర రోగనిరోధక శక్తిని బలపరచడంలో చిలగడదుంపలు ఎంతగానో సహాయపడతాయి. ఈ దుంపలు ముదురు నారింజ రంగులో ఉంటే.. దానిలో బీటా-కెరోటిన్ ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. ఇలా ముదురు రంగులో ఉండటానికి కారణం.. బీటా-కెరోటిన్ అనే శక్తివంతమైన వర్ణద్రవ్యం. ఈ దుంపలు సహజంగానే తీపిగా ఉండే ఈ బీటా-కెరోటిన్ యొక్క గొప్ప వనరుల్లో ఒకటి. కాబట్టి ఇది మన శరీరంలో విటమిన్ ‘ఏ’గా మారుతుంది. స్వీట్ పొటాటోస్‌ను పిల్లలకు తరచూ పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. పరీక్షల సమయంలో పిల్లల మెదడు వేగంగా పనిచేసేలా చేస్తుంది. అలాగే చిలగడదుంపలు మెదడును ఆక్సీకరణ నష్టం నుండి కాపాడుతుంది. కనుక, ఇది అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

చర్మ ఆరోగ్యానికీ మంచిదే:

Advertisement

ఈ వణిచించే చలికాలంలో చిలగడదుంపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలని సిఫార్సు చేస్తున్నారు వైద్య నిపుణులు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాక.. గుండె ఆరోగ్యానికి మేలు చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఈ దుంపలు తింటే.. చర్మ కాంతి, ఎముకల బలం పెరుగుతుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే చిలగడదుంపలను చలికాలంలో శరీరానికి సంపూర్ణ పోషకాహారంగా చెప్పవచ్చు.

Read Also: కాబోయే అమ్మలూ.. శీతాకాలంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట!

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×