E-Paper
Advertisement

Air Purifying Plants: స్వచ్ఛమైన గాలిని అందించే.. అద్భుతమైన మొక్కలు ఇవే !

Air Purifying Plants: స్వచ్ఛమైన గాలిని అందించే.. అద్భుతమైన మొక్కలు ఇవే !
Advertisement

Air Purifying Plants: ప్రస్తుత ప్రపంచంలో.. మనం బయట పీల్చే గాలి కంటే ఇంట్లో ఉండే గాలి మరింత కలుషితంగా మారుతోంది. పెయింట్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్ వంటి వాటి నుంచి విడుదలయ్యే హానికరమైన రసాయనాలను (ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోఎథైలీన్ వంటివి) తొలగించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించడంలో ఇండోర్ ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఖరీదైన ఎయిర్ ప్యూరిఫైయర్‌లకు బదులుగా.. ప్రకృతి సిద్ధమైన ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

తాజా పరిశోధనలో గాలిని శుద్ధి చేయగలవని తేలిన, ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన కొన్ని ఉత్తమమైన ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. స్నేక్ ప్లాంట్ :
ఈ మొక్కను ‘మదర్-ఇన్-లాస్ టంగ్’ అని కూడా అంటారు. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేసే అరుదైన గుణం కలిగి ఉంటుంది. ఇది ఫార్మాల్డిహైడ్ , ట్రైక్లోరోఎథైలీన్ , బెంజీన్ వంటి రసాయనాలను శుద్ది చేస్తుంది. అంతే కాకుండా వీటికి తక్కువ వెలుతురు, తక్కువ నీరు సరిపోతుంది. బెడ్‌రూమ్‌లో పెంచుకోవడానికి ఇది అత్యంత అనువైన మొక్క.

2. పీస్ లిల్లీ :
తెల్లటి పూలతో అందంగా కనిపించే ఈ మొక్క కేవలం అలంకరణకే కాదు. గాలిని శుద్ధి చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.
బెంజీన్, ఫార్మాల్డిహైడ్, అమ్మోనియా, ట్రైక్లోరోఎథైలీన్ వంటి వాటిని సమర్థవంతంగా తొలగిస్తుంది.ఇది పరోక్ష కాంతిలో పెరుగుతుంది. మొక్క మొదట్లో ఉన్నమట్టి పొడిగా మారినప్పుడు మాత్రమే నీరు పోయాలి.

Advertisement

3.స్పైడర్ ప్లాంట్ :
ఈ మొక్కను పెంచడం చాలా సులభం. దీనికి ‘పిల్లలు’ (చిన్న మొక్కలు) త్వరగా వస్తాయి. వాటిని వేరే కుండీల్లో కూడా నాటుకోవచ్చు. ఇది గదిలో తేమను కూడా పెంచుతుంది. ఇది ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ , జైలీన్, టోలున్ వంటి రసాయనాలను శుద్ది చేస్తుంది. దీన్ని వేలాడే కుండీల్లో పెంచుకోవడం చాలా మంచిది. ఇది ప్రకాశవంతమైన, పరోక్ష కాంతిలో కూడా బాగా పెరుగుతుంది.

4. మనీ ప్లాంట్ (ల్డెన్ పోథోస్):
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మొక్క ఇది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని కూడా నమ్ముతారు. ఇది గాలిలోని విష పదార్థాలను తొలగించి ఆక్సిజన్‌ను బాగా విడుదల చేస్తుంది. అంతే కాకుండా ఇది ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి వాటిని శుద్ది చేస్తుంది.
మట్టిలో లేదా నీటిలో సులభంగా ఇది పెరుగుతుంది. దీనికి తక్కువ వెలుతురు ఉన్నా సరిపోతుంది. దీన్ని ఇంట్లో ఎక్కడైనా కూడా పెంచుకోవచ్చు.

Also Read: మీ వయస్సు కంటే చిన్నగా కనిపించాలా ? అయితే డైలీ ఇలా చేయండి చాలు

5. అలోవెరా :
అలోవెరా ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని శుభ్రపరచడమే కాకుండా.. చర్మ సమస్యలకు చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన కణాలను ఫిల్టర్ చేయడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా ఇది
దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. తగినంత వెలుతురు ఉన్న చోట పెడితే బాగా ఎదుగుతుంది.

6. బోస్టన్ ఫెర్న్:
ఈ మొక్క ముఖ్యంగా గాలిలోని తేమను పెంచడంలో సహాయ పడుతుంది. ఇది గాలిని శుద్ధి చేయడంలో అత్యంత ప్రభావ వంతమైనదిగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఇది ఫార్మాల్డిహైడ్ , జైలీన్ వంటి రసాయనాలను శుద్ది చేస్తుంది. దీనికి తేమ ఎక్కువగా ఉండాలి. అంతే కాకుండా పరోక్ష సూర్యకాంతి లేదా నీడ పట్టున బాగా పెరుగుతుంది.

ఇంట్లో పచ్చదనం ఉంటే.. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.ఈ మొక్కలు కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా.. మన ఆరోగ్యాన్ని కాపాడే సజీవ ఎయిర్ ప్యూరిఫైయర్‌ల లాగా పనిచేస్తాయి. మీ స్థలం, లైటింగ్ పరిస్థితులకు అనుగుణంగా మీకు నచ్చిన మొక్కలను ఎంచుకుని, ఇంట్లో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలిని ఆస్వాదించండి.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×