E-Paper
Advertisement

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు భయ్యా.. నెలకు రూ.15వేలు వచ్చేస్తయ్

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు భయ్యా.. నెలకు రూ.15వేలు వచ్చేస్తయ్
Advertisement

Bank of Baroda: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్యాంక్ బరోడా నుంచి 2700 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. డిసెంబర్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2700

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటీస్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

ఉద్యోగాలు – వెకెన్సీలు:

అప్రెంటీస్ పోస్టులు: 2700

తెలుగు రాష్ట్రాల్లోనూ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఏపీలో 38, తెలంగాణలో 154 పోస్టులు వెకన్సీ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు..

ఏపీ: 38 పోస్టులు
తెలంగాణ: 154 పోస్టులు

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

స్టైఫండ్: అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.15 వేల వరకు స్టైఫండ్ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 11

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 1

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ రాత పరీక్ష, స్థానిక భాషలో ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు రూ.15000 స్టైఫండ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2700

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 1

అఫీషియల్ వెబ్ సైట్: https://bankofbaroda.bank.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×