E-Paper
Advertisement

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం
Advertisement

Bedtime For Kids| ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో నిద్రపోవడం కూడా అంతే అవసరం. పిల్లల విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటున్నారు. చదువు, మొబైల్ ఫోన్లు, టీవీ చూడటం లేదా మారిన జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. అయితే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

పిల్లలకు మంచి నిద్ర ఎందుకు అవసరం?

నిద్ర కేవలం అలసటను తగ్గించడానికి మాత్రమే కాదు. ఇది మెదడు రోజంతా నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. మంచి నిద్ర వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పిల్లలు మరుసటి రోజు ఉత్సాహంగా ఉండేందుకు కూడా నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది.

రాత్రి 8 గంటలకు నిద్రపోతే

Advertisement

మనిషి శారీరక ఎదుగుదలకు రాత్రి 8 గంటల సమయంలో నిద్రపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఈ సమయంలో పడుకునే పిల్లలకు గాఢ నిద్ర ఎక్కువగా లభిస్తుంది. గాఢ నిద్ర శరీర ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిల్లలు కొత్త విషయాలను సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.

రాత్రి 9 గంటలకు వరకు మెలకువగా ఉంటే

రాత్రి 9 గంటలకు నిద్రపోవడం కూడా మంచి అలవాటే. ఈ సమయానికి పడుకోవడం వల్ల మెదడుకు రోజంతా జరిగిన విషయాలను సక్రమంగా గుర్తుంచుకునే అవకాశం లభిస్తుంది. శరీరం కూడా పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. అందువల్ల పిల్లలు మరుసటి రోజు ఉత్సాహంగా లేస్తారు.

రాత్రి 10 గంటలకు నిద్రపోతే

Advertisement

రాత్రి 10 గంటలకు నిద్రపోవడం పూర్తిగా చెడు అలవాటు కాదు. అయితే ఈ సమయానికి పడుకోవడం వల్ల గాఢ నిద్రలోని కొన్ని ముఖ్యమైన గంటలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీంతో నిద్రపోయినా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అందకపోవచ్చు.

రాత్రి 11 గంటలకు నిద్రపోతే

రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం పిల్లలకు మంచిది కాదు. ఈ సమయంలో నిద్ర నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఏకాగ్రత తగ్గడం, మూడ్ స్వింగ్స్ రావడం, ఉదయం లేవడంలో ఇబ్బంది రావడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అలాగే రోజంతా అలసట కూడా వేధించవచ్చు.

రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉంటే

అర్థరాత్రి వరకు మేల్కొని ఉండే పిల్లల మెదడు ఎక్కువగా అలసిపోతుంది. శరీరానికి విశ్రాంతి అవసరమైనప్పటికీ వెంటనే నిద్ర పట్టకపోవచ్చు. దీని వల్ల మొత్తం నిద్ర నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది.

Also Read: ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

రాత్రి 1 గంటకు నిద్రపోతే

రాత్రి 1 గంటకు నిద్రపోవడం పిల్లల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఒకవేళ నిద్రపోయినా నాడీ వ్యవస్థ పూర్తిగా విశ్రాంతి పొందకపోవచ్చు. దీని ప్రభావం చదువు, ప్రవర్తన, భావోద్వేగాలు మరియు రోజువారీ పనితీరుపై పడే అవకాశం ఉంటుంది.

పిల్లలు సరైన సమయానికి నిద్రపోయేందుకు టిప్స్

తల్లిదండ్రులు ప్రతిరోజూ ఒకే సమయంలో పిల్లలను నిద్రపోయేలా ప్రోత్సహించాలి. నిద్రకు ముందు మొబైల్, టీవీ వంటి స్క్రీన్‌ల వినియోగాన్ని తగ్గించాలి. ప్రశాంతమైన వాతావరణం కల్పించడం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. సమతుల్యమైన ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర కలిసి పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి.

గమనిక: స్కూల్ వెళ్లే వయస్సు పిల్లలకు ప్రతి రోజు 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం. టీనేజర్లకు సాధారణంగా 8 నుంచి 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఎంత పెద్ద కష్టమైనా గెలుపు సాధిస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన వారిలో ప్రత్యేక లక్షణం

 

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×