E-Paper
Advertisement

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!
Advertisement

Niharika:2024వ సంవత్సరానికి గానూ.. జూలై 18 వ తేదీన న్యూఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా విడుదల చేసింది. ఇందులో ఉత్తమ చిత్రం కేటగిరీలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి ఏకంగా రెండు నేషనల్ అవార్డులు లభించాయి. ఒకటి ఉత్తమ తెలుగు చిత్రం కాగా, మరొకటి బెస్ట్ మేకప్ కేటగిరిలో ఈ చిత్రానికి అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక దాంతో కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. ఈ ఇందులో భాగంగానే జూలై 19న హైదరాబాద్లో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం వేడుకలు కూడా జరుపుకుంది.

కమిటీ కుర్రోళ్లు టీం పై మెగాస్టార్ ప్రశంస..

ముఖ్యంగా నిహారికకు నేషనల్ అవార్డు లభించడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా టాలీవుడ్ తరఫున నేషనల్ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అలాగే తన తమ్ముడి కూతురైన నిహారిక కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడంతో ఇప్పుడు తాజాగా కమిటీ కుర్రోళ్లు టీం ఏర్పాటు చేసిన వేడుకలలో నిహారిక తన పెదనాన్న చిరంజీవి చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకొని చేసిన క్రేజీ కామెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

నేషనల్ అవార్డు విన్నింగ్ పై నిహారిక కామెంట్స్.

Advertisement

నిహారిక మాట్లాడుతూ..” నా 32 ఏళ్ల జీవితంలో నేను ఏదైనా మంచి పని చేశాను అంటే అది కమిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించడమే. రెండేళ్ల నుంచి ఒక మనిషి నన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాడు సరే కథ విందాం అని వంశీని పిలిపించాను. ఒక మంచి సినిమా తీసినప్పుడు దానిని ఆడియన్స్ కి చేరువయ్యేలా ప్రమోట్ చేయాలి. ఇక అందరికీ మెంటల్ వచ్చేలా మేము ప్రమోషన్స్ చేసాము. చిన్న ఊరికి వెళ్లి ఆడియన్స్ కి చెప్పాము. సినిమా బాగోకపోతే మనం ఎంత ప్రమోట్ చేసినా కూడా అది హిట్ అవ్వదు. కమిటీ కుర్రోళ్లు సినిమా కోసం ప్రతి ఒక్కరు చెమట చిందించారు.

ప్రతి ఒక్కరి పేరెంట్స్ తో నేను మాట్లాడాను. ప్రతి రోజూ.. ఇది నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ అని వంశీ నాతో చెప్పేవారు. అయితే నేషనల్ అవార్డు సినిమాను నిర్మించాలని నా కలలో కూడా నేను అనుకోలేదు. కమిటీ కుర్రోళ్లు సినిమా గురించి నా విజన్ బోర్డులో రాసుకున్నాను. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా నేషనల్ అవార్డ్స్ జాబితాలో ఉండడంతో నా ఆనందం రెట్టింపు అయింది.

Advertisement

also read:కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

పెదనాన్న కంటే ఇప్పుడు నేనే తోపు – నిహారిక

కమిటీ కుర్రోళ్లు సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ ఇచ్చినందుకు జ్యూరీ మెంబర్స్ కి కృతజ్ఞతలు. అలాగే మాతోపాటు నేషనల్ అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే మీడియా వాళ్ళు , ఆడియన్స్ , మా నాన్న అందరూ కూడా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు. అవార్డ్స్ ప్రకటించాక నేరుగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాను. సురేఖ మమ్మీ చాలా సంతోషంగా ఉన్నారు. రుద్రవీణ సమయంలో డాడీ వెళ్లి నేషనల్ అవార్డు తీసుకున్నారు. అప్పుడు మీ నాన్న తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకోబోతున్నావ్.. చాలా గర్వంగా ఉంది అని అన్నారు. ఆయనే ఇండస్ట్రీకి గర్వకారణమని నేనెప్పుడూ ఫీల్ అవుతాను. అలాంటిది ఆయనే నన్ను ఫ్రైడ్ అన్నారంటే.. తోపే నువ్వు తోపు అంటుంటే.. నేను కచ్చితంగా తోపునే” అంటూ నిహారిక క్రేజీ కామెంట్లు చేసింది. ఇక ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×